Team India: శ్రీలంకతో జరిగిన రెండవ టీ20లో సూర్య కుమార్ సారథ్యంలో టీమిండియా ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. Team India

Gambhir has come Team India is not going anywhere

దీంతో టీమిండియా లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. భారత్ 6.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని చేదించింది. మూడు టీ20ల సిరీస్ ను టీమిండియా 20తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా అర్థ సెంచరీ సాధించాడు. Team India

Also Read: Manu Bhaker: మారుమోగుతున్న మను భాకర్ పేరు..ఇంతకీ ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే ?

ఓపెనర్ పతుమ్ నిస్సంక 32 పరుగులు, కమిందూ మెండీస్ 26 పరుగులు చేశాడు. మిగతా ఎవరు కనీసం 15 పరుగులు కూడా చేయలేదు. దీంతో శ్రీలంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ కు ఓపెనర్ గా అవకాశం వచ్చింది. Team India

కానీ అతను డకౌట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వేగంగా ఆడటంతో భారత్ 6.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, గంభీర్ కోచ్ ఐన తర్వాత… టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. Team India