Heroine who is ready for the fourth marriage

Heroine: ఏంటి ఆ హీరో నిజంగానే నాలుగో పెళ్లి చేసుకోబోతుందా.. మూడు పెళ్లిళ్లు పూర్తయ్యాక నాలుగో పెళ్లికి రెడీ అయిందా అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. వనిత విజయ్ కుమార్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. సినీ ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ సీనియర్ నటి మంజుల, విజయ్ కుమార్ ల పెద్ద కూతురు.. వనిత విజయ్ కుమార్ తెలుగులో దేవి మూవీ తో ఫేమస్ అయింది. అయితే ఈమె చేసింది తెలుగులో ఒక మూవీ అయినప్పటికీ ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Heroine who is ready for the fourth marriage

ఇక ఆ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేసింది.ఇక రీసెంట్గా నరేష్ పవిత్ర లోకేష్ మళ్లీ పెళ్లి మూవీలో నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి పాత్ర పోషించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా నాలుగో పెళ్లికి రెడీ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.దానికి ప్రధాన కారణం వనిత విజయ్ కుమార్ మాట్లాడిన మాటలే.. వనిత విజయ్ కుమార్ ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. (Heroine)

Also Read: Bunny: బన్నీ సారీ చెప్పాల్సిందే.. మెగా అల్లు ఫ్యామిలీ వివాదం పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..?

అయితే ఈ యూట్యూబ్ ఛానల్ లో తన అభిమాని అడిగిన ఓ ప్రశ్నకు మీరు ఊహించనిది త్వరలో జరగబోతుంది అంటూ ఆన్సర్ ఇవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఊహించంది అంటే వనిత విజయ్ కుమార్ నాలుగో పెళ్లి చేసుకోబోతుందా ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇప్పటికే సినీ యాక్టర్ ఆకాష్ ని మొదటి పెళ్లి చేసుకున్న వనిత ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే ఆయనకు విడాకులు ఇచ్చేసి ఆనంద్ అనే బిజినెస్మెన్ ని పెళ్లాడింది.

Heroine who is ready for the fourth marriage

ఇక వీరిద్దరి మధ్య కూడా సఖ్యత కుదరకపోవడంతో పీటర్ పాల్ అనే వ్యక్తిని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది.కానీ ఆ వ్యక్తితో కూడా మనస్పర్ధలు రావడంతో అతనికి కూడా విడాకులు ఇచ్చేసి ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. అయితే అలాంటి వనిత విజయ్ కుమార్ త్వరలోనే నాలుగు పెళ్లిళ్లు చేసుకోబోతున్నట్టు రూమర్ వినిపిస్తోంది.(Heroine)