Pawan Kalyan: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పిఠాపురం నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక అటు ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీ.. అనేక చిక్కులను ఎదుర్కొంటోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలపై వరుసగా చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెడుతోంది. Pawan Kalyan

Pawan is a shock to Jagan in this case That key leader jump

పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, కొడాలి నాని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలపై… అక్రమంగా కేసులు బనాయిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. గత వైసిపి పాలనలో ఈ నేతలందరూ టిడిపి నేతలను చాలా ఇబ్బంది పెట్టారు. ఇక ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. వారిని టార్గెట్ చేస్తున్నారు. ప్రతి కారం తీర్చుకుంటున్నారు. Pawan Kalyan

Also Read: Chandrababu: జగన్మోహన్ రెడ్డికి…చంద్రబాబు బంపర్ ఆఫర్ ?

ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. పిఠాపురం నియోజకవర్గంలో.. కీలక నేత జంపు కానున్నారు.వైసీపీ పార్టీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేసే యోజనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తన అనుచరులతో సంప్రదింపులు కూడా కొనసాగిస్తున్నారట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు కాదని… వంగ గీతా కు టికెట్ ఇవ్వడం పై ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారట. Pawan Kalyan

తనకు టికెట్ ఇచ్చి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవని… పవన్ కళ్యాణ్ ను తాను ఓడించే వాడినని ఆయన అనుకున్నారట. ఇక ఇప్పుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన లోనే చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట దొరబాబు.ఇక ఈ విషయం తెలియగానే… దొరబాబును బుజ్జగించే పనిలో పడిందట వైసీపీ అధిష్టానం. మంచి రోజులు మనకు కూడా వస్తాయని అప్పటి వరకు వెయిట్ చేయాలని కోరుతున్నారట. మరి ఈ నేపథ్యంలో దొరబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. Pawan Kalyan