The heroine who rejected if given a chance in Chiranjeevi movie

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా కాదనకుండా చేస్తుంది.వేరే సినిమాల్లో నటిస్తూ డేట్స్ సర్దుబాటు కాకపోయినా కూడా ఏదో విధంగా డేట్స్ సర్దుబాటు చేసుకొని మరీ చిరు మూవీలో నటిస్తారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే మొహం మీదే చేయనని రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరు..ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.

The heroine who rejected if given a chance in Chiranjeevi movie

బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ లతో నటించిన సీనియర్ నటి ఇంద్రజ చిరంజీవితో మాత్రం ఓ సినిమాలో అవకాశం వస్తే రిజెక్ట్ చేసింది. ఆ సినిమా ఏదో కాదు హిట్లర్.. మెగాస్టార్ హీరోగా చేసిన హిట్లర్ మూవీలో చిరంజీవి పెద్ద చెల్లెలు పాత్రలో నటించే అవకాశం ముందుగా ఇంద్రజకి వచ్చిందట.(Chiranjeevi)

Also Read: Meena: ఆ హీరో కోసమే స్విమ్ సూట్.. మీనా షాకింగ్ కామెంట్స్..?

కానీ చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించాలి అనుకునే ఇంద్రజకి చెల్లెలు పాత్ర అంటే చేయడానికి మనసొప్పలేదట. దాంతో ఆ సినిమాని రిజెక్ట్ చేసిందట. ఇక ఆ క్యారెక్టర్ ని టీవీ నటి అశ్విని పోషించారు. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంద్రజ మాట్లాడుతూ..ఈ సినిమాని రిజెక్ట్ చేసింది నిజమే.

The heroine who rejected if given a chance in Chiranjeevi movie

ఒక రకంగా చిరంజీవి పక్కన హీరోయిన్ గా చేయాలనుకున్నాను.కానీ చెల్లెలు అవకాశం వచ్చేసరికి మళ్ళీ ఎక్కడ హీరోయిన్ అవకాశాలు కోల్పోతానోనని ఆ సినిమాలో చెల్లెలు పాత్ర చేయలేదని చెప్పింది. అంతేకాకుండా ఆ సినిమా చేయకపోవడానికి మరొక కారణం వేరే సినిమాలో బిజీగా ఉండడం వల్ల డేట్స్ సర్దుబాటు కాక దాన్ని రిజెక్ట్ చేశానని క్లారిటీ ఇచ్చింది.(Chiranjeevi)