Three weddings at the same time in Akkineni family

Akkineni family: నిజంగానే అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయా..ఒకేసారి మూడు పెళ్లిళ్లు జరగబోతున్నాయా? ఇదే నిజమైతే అక్కినేని అభిమానులకు కొండంత పండగ అని కామెంట్స్ పెడుతున్నారు ఈ విషయం తెలిసిన అక్కినేని ఫ్యాన్స్.మరి నిజంగానే అక్కినేని ఫ్యామిలీలో మూడు పెళ్లిళ్లు జరగబోతున్నాయా అనేది ఇప్పుడు చూద్దాం. త్వరలోనే శ్రావణం రాబోతుంది. పెళ్లిళ్లకు మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి.దాంతో చాలామంది సామాన్య జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా శుభకార్యాలు చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు.

Three weddings at the same time in Akkineni family

అయితే ఇలాంటి వేళ టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఓ వార్త వినిపిస్తోంది.అదేంటంటే అక్కినేని ఫ్యామిలీలో ఒకేసారి మూడు పెళ్లిళ్లు జరగబోతున్నట్టు టాక్. ఇక విషయంలోకి వెళ్తే..నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రస్తుతం విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు.అలాగే అఖిల్ కూడా శ్రియా భూపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కాకుండానే రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ సింగిల్గానే ఉన్నారు.(Akkineni family)

Also Read: Allu Arjun: అవకాశాల కోసం ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న అల్లు అర్జున్..?

అలాగే అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ కూడా మొదట దివంగత నటుడు చరణ్ రెడ్డిని పెళ్లి చేసుకొని కొద్ది సంవత్సరాలకే విడాకులు తీసుకుంది. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు సింగిల్గానే ఉంటున్నారు.కాబట్టి ఈ ముగ్గురు పెళ్లిళ్లు ఒకేసారి చేయాలని అక్కినేని ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందట. అందుకే ఆగస్టులో ముగ్గురు ఎంగేజ్మెంట్లు ఒకేసారి జరిపించి పెళ్లి తంతును కూడా ఒకేసారి చేయాలి అని అక్కినేని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్టు ఓ వార్త వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఎప్పటినుండో అక్కినేని అభిమానులు కోరుకుంటుంది నిజమవుతుంది.

Three weddings at the same time in Akkineni family

ఇక నాగచైతన్య ఇప్పటికే శోభిత ధూళిపాలతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కి పెళ్లి చేయాలని నాగార్జున కూడా ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.అలాగే అఖిల్ కి కూడా ఓ బిజినెస్ మాన్ కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నారట. సుప్రియ ప్రస్తుతం అడివి శేష్ తో ప్రేమలో ఉందనే టాక్ వినిపిస్తోంది.ఇలా వీరి ముగ్గురు పెళ్లిళ్లు ఒకేసారి చేయాలని నాగార్జున నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి వైరల్ అయ్యే రూమర్ లో ఎంత నిజం ఉందో చూడాలి.(Akkineni family)