Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు రెండవ పథకం లభించింది. మొదటిసారి కాంస్యం సాధించిన మను భాకర్ రెండవ పథకంలో కూడా భాగస్వామి కావడం విశేషం. పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్డ్ టీం ఈవెంట్ లో మడుబాకర్ తో కలిసి కాస్యం సాధించాడు సరబ్‌జోత్ సింగ్ .. ఈ విజయంతో మను భాకర్ ఒలింపిక్స్ లో సంచలనం సృష్టించింది. Paris Olympics

A sensation in the history of Olympics A common farmer’s son.. Sarabjot Singh

124 సంవత్సరాల ఒలింపిక్స్ హిస్టరీలో ఒకే ఒలింపిక్స్ టోర్నమెంట్ లో రెండు మెడల్స్ సాధించిన ఏకైక భారతీయులుగా నిలిచింది. మనుభాకర్ త్వరలో 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కూడా పోటీ పడనుంది. అది కూడా గెలిస్తే సింగిల్ ఒలింపిక్స్ లో మూడు పథకాలు సాధించిన ప్లేయర్ గా నిలవనుంది.అయితే… మను తో ఆడిన సరబ్ జోత్ సింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇతను గత సంవత్సరమే భారత షూటింగ్లో బాగా పాపులర్ అయ్యాడు. Paris Olympics

Also Read: Manu Bhaker: మారుమోగుతున్న మను భాకర్ పేరు..ఇంతకీ ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే ?

అంతేకాదు ఆసియా క్రీడల్లో పది మీటర్ల ఎయిర్ పిస్టోల్, మిక్స్డ్ టీం ఈవెంట్లలో గోల్డ్ కూడా కొట్టేశాడు. ఇక ఇతని కుటుంబం సామాన్య రైతు కుటుంబం. రైతు కుటుంబంలో జన్మించిన ఈ సింగ్.. ఇప్పుడు ప్యారిస్ ఒలంపిక్స్ లో దుమ్ము లేపుతున్నాడు. హరియన రాష్ట్రంలోని అంబాల జిల్లా దీన జాట్ గ్రామం ఇతని ఊరు. ఇక ఇతని తండ్రి జతిందర్ సింగ్. ఇతడు సామాన్య రైతు, మరియు కూలి కూడా. ఈ సింగ్ తల్లి హౌస్ వైఫ్. డి ఏ వి కాలేజీలో విద్యను అభ్యసించిన సింగ్… ఆ తర్వాత షూటింగ్లో రాణించగలిగాడు. ఇప్పుడు సక్సెస్ అవుతున్నాడు. Paris Olympics