Bhagyashri Borse: కొంతమంది హీరోయిన్ల అదృష్టం ఎలా ఉంటుంది అంటే ఒక్క సినిమా విడుదల కాకపోయినా కూడా వారికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ హీరోయిన్ కు భారీ స్థాయిలో క్రేజ్ రావడం ఆమెకు భారీ స్థాయిలో అభిమానులను ఏర్పడేలా చేస్తుంది. వాస్తవానికి చెప్పాలి అంటే టాలీవుడ్ చిత్రం పరిశ్రమ లో హీరోయిన్ల కొరత బాగానే ఉంది. ఒకరిద్దరు తప్ప మిగతా వారందరూ కూడా పెద్ద హీరోల సినిమాలలో తేలిపోతూ ఉన్న సందర్భంలో ఒక సరైన హీరోయిన్ రావాల్సిన అవసరం ఉన్న సమయంలో మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.

Bhagyashri Borse tollywood entry discussion

ఇప్పుటి దాకా తెలుగులో సినిమాలేవి చేయకపోయినప్పటికీ ఆమెకు తొలి సినిమా విడుదలకు ముందే మంచి క్రేజ్ ఏర్పడుతుందని చెప్పాలి. మిస్టర్ బచ్చన్ సినిమా ఆమెకు భారీ స్థాయిలో టాలీవుడ్ ఎంట్రీని ఇస్తుందని చెప్పాలి. ఇప్పటికే వచ్చిన ప్రోమోలు, పాటలు భాగ్యశ్రీను ఎంతో హైలెట్ చేశాయి. ఆమె అందచందాలు, హావ భావాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే స్టార్ హీరోయిన్ అయిపోయింది అని చెప్పాలి. ఇక ఆమె తన అభినయంతో ప్రేక్షకులను చెప్పాల్సిన మెప్పించాల్సిన అవసరం మాత్రమే ఉంది.

ఇక తాజాగా ఈ సినిమా కోసం ఆమె తన సొంత డబ్బింగ్ చెప్పుకున్నట్లు తెలుస్తుంది. సినిమా టీం కూడా అఫీషియల్ గా దీనికి సంబంధించిన ప్రకట ఇవ్వడంతో ఆమె ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు. చాలామంది హీరోయిన్ లు తొలి సినిమాతో డబ్బింగ్ చెప్పిన సందర్భాలు తక్కువ. రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత డబ్బింగ్ వైపు వెళుతుంటే ఈమె తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఏదేమైనా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఒక స్టార్ హీరోయిన్ వచ్చిందని చెప్పాలి. ఒకటి రెండు సినిమాల్లో మంచి నటన కనబరిస్తే మాత్రం ఆమెకు టాలీవుడ్ పట్టం కట్టడం ఖాయం అని తెలుస్తుంది.

మొదటి సినిమా విడుదల కంటే ముందుగానే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రోమోలతోనే ఆకట్టుకున్న ఈమె టాలీవుడ్ లో పెద్ద హీరోల సరసన నటించబోతూ ఉండడం విశేషం. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న సినిమా లో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఆ సినిమా యొక్క షూటింగ్ లో కూడా పాల్గొంది. ఇవే కాకుండా చాలా మంది యువ హీరోయిన్ లు ఈమెను తమ సినిమా లలో హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆమె టాలీవుడ్ లో ఏ స్థాయి కి వెళుతుందో చూడాలి.