Game Changer Movie Kiara Advani Look

Game Changer: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా పట్ల ప్రేక్షకులలో అదొక రకమైన భావం ఉన్నట్లుగా వారి కామెంట్లను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా మెగా అభిమానులు ఈ సినిమా తెరకెక్కిన విధానం పట్ల ఎంతో నిరాశగా ఉన్నారు. ఒక గ్లోబల్ స్టార్ సినిమా అయి ఉండి ఇలా బ్రేకులతో సినిమా ను తెరకెక్కించడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఫైనల్ గా ఈ సినిమాను మళ్ళీ మొదలుపెట్టి పూర్తి చేసే దశకు తీసుకు వచ్చినందుకు వారు ఎంతో హ్యాపీగా ఉన్నా కూడా ఇన్ని రోజులు ఆలస్యం అవ్వడం పట్ల ఇంకా ఆగ్రహం గా ఉన్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని చర్చల ద్వారా తెలుస్తుంది.

Game Changer Movie Kiara Advani Look

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీ లుక్కు కి సంబంధించిన అప్డేట్ ఈరోజు విడుదల కాగా ఆ లుక్కు చూసిన ప్రతి ఒక్కరు కూడా కియార అందాన్ని పొగుడుతూ సినిమాకు తప్పకుండా ఆమె అందం హెల్ప్ అవుతుంది అని చెబుతున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పబ్లిసిటీ కంటెంట్ కూడా విడుదల అవ్వడం జరగలేదు. అప్పుడెప్పుడో వచ్చిన ఒక పాట తప్ప మరేమీ కూడా విడుదల కాలేదు. దాంతో తాజాగా ఈ హీరోయిన్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ అవ్వడం అది పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేయడం పట్ల అందరు హ్యాపీగా ఉన్నారు.

Also Read: Bhagyashri Borse: టాలీవుడ్ కొత్త అందం.. అందరిని మెప్పించినట్లేనా!!

ఇక సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ పార్ట్ పూర్తి కావడంతో మిగతా ఆర్టిస్టులకు సంబంధించిన సీన్స్ ను తెరకెక్కించే పనిలో శంకర్ ఉన్నారట. తమన్ రీ రికార్డింగ్ పనుల్లో ఉన్నాడట. డిసెంబర్లో ఈ సినిమా రాబోతుంది అని చెబుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను త్వర త్వరగా పూర్తి చేస్తున్నారు. తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేయనున్నారు. మూడేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న సినిమా కావడంతో ఈ చిత్రం పట్ల అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీనికి భారీ ఎలివేషన్లు ఇవ్వడం సినిమా పట్ల మంచి సిగ్నల్స్ ఇవ్వడం అంచనాలను మరింత పెంచుతుంది. మరి శంకర్ కు అనుకున్న విజయం ఈ సినిమా తో వస్తుందా రామ్ చరణ్ క్రేజ్ ను మరింతగా ఈ సినిమా పెంచుతుందా అనేది చూడాలి.