Is Kiran Abbavaram getting married in that state because of that sentiment

Kiran Abbavaram: యంగ్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కిరణ్ అబ్బవరం తోటి నటి అయినటువంటి రహస్య గోరఖ్ తో ప్రేమలో పడ్డ సంగత మనకు తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాదులోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యుల మధ్యలో ఫ్యామిలీ ఫంక్షన్ గా చాలా ప్రైవేట్ గా జరిగింది. వీరి నిశ్చితార్ధం ఈ ఏడాది మార్చి 13న గ్రాండ్గా జరిగింది. ఇక ఎంగేజ్మెంట్ జరిగే వరకు కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్న సంగతి ఎవరికీ తెలియదు. రహస్య గోరఖ్,కిరణ్ అబ్బవరం కాంబినేషన్లో రాజావారు రాణి గారు అనే సినిమా వచ్చింది.

Is Kiran Abbavaram getting married in that state because of that sentiment

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్తున్నారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం శ్రావణం రాబోతుంది కాబట్టి మంచి ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ఆగస్టు 22న వీరు తమ పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా బయటపడింది. కేరళలో రహస్య గోరఖ, కిరణ్ అబ్బవరంలు గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని చూస్తున్నారట.(Kiran Abbavaram)

Also Read: Prema: ఆ హీరో కోసమే సీనియర్ నటి ప్రేమ భర్తకు విడాకులు ఇచ్చిందా..?

వీరి పెళ్లి ఆగస్టు 22న జరిగాక ఆగస్టు 24న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే సెలబ్రిటీలు అందరికీ కలిపి ఒక పెద్ద పార్టీని కిరణ్ అబ్బవరం,రహస్య గోరఖ్ లు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే చాలామంది సెలబ్రిటీలు జైపూర్ లేదా గోవా ఇలాంటి ప్రదేశాలలో పెళ్లి చేసుకుంటారు. ఇంకొంతమంది విదేశాలలో తమ వివాహాన్ని చేసుకుంటారు.

 Is Kiran Abbavaram getting married in that state because of that sentiment

కానీ రహస్య గోరఖ్,కిరణ్ అబ్బవరంలు తమ పెళ్లిని కేరళలో జరుపుకోవడంతో వీరికి అక్కడ ఏదైనా సెంటిమెంట్ ఉంది కావచ్చు అందుకే అక్కడ పెళ్లి చేసుకుంటున్నారని పలువురు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం “క” అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. మోస్ట్ ప్రామిసింగ్ స్టార్ గా ఉన్న కిరణ్ అబ్బవరం,రహస్య గోరఖ్ లు ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా కలకాలం కలిసి ఉండాలని వీరి అభిమానులు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(Kiran Abbavaram)