Is Pushpa2 release postpone again

Pushpa2: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ కావడంతో పుష్ప రెండో భాగం సినిమాపై ఇప్పుడు అందరి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని మార్చడంతో భారీ స్థాయిలో నెగెటివిటీని మూటకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు మరొకసారి వాయిదా పడబోతుంది అనే వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయనాలి. ఆగస్టు 15వ తేదీన పుష్ప రెండవ భాగం సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు నిర్మాతలు మొదట్లో.. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడింది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని కొన్ని సీన్లు షూట్ చేయకపోవడంతోనే వాయిదా పడింది అని కొందరు అంటుంటే లేదు వీ ఎఫ్ ఎక్స్ సరిగ్గా జరగలేదని కూడా చెబుతారు.

Is Pushpa2 release postpone again

ఇవేవీ కాదు ఓ పొలిటికల్ ఇష్యూ నే సినిమా వాయిదా పడడానికి కారణం అని అంటున్నారు. ఆవిధంగా ఈ సినిమా విడుదల జాప్యం జరగడానికి పలు రకాల కారణాలు అని అంటూ ఉంటారు. ఏదేమైనా పుష్పలాంటి భారీ పాన్ ఇండియా సినిమా ఈ విధంగా వాయిదా పడుతూ ఉండడం ఎవరికీ మంచిది కాదని సినీ పెద్దలు చెబుతున్నారు. ఫైనల్ గా డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేయగా ఈ సినిమా ఈ తేదీన కూడా రావడం కష్టమే కొందరు చెబుతున్నారు. దానికి కారణం ఈ సినిమాలో విలన్ గా నటించిన ఫాహాద్ అంటున్నారు.

Also Read: Kamal Haasan: విడుదల తర్వాత కూడా కమల్ సినిమా కి కష్టాలే!!

గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం డేట్లు కేటాయించి విషయంలో ఎంతో నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నాడట. ఇతర సినిమాకు ఇచ్చిన కమిట్మెంట్ల నేపథ్యంలో ఈ సినిమాకు ఎక్కువగా డేట్లు ఇవ్వలేకపోతున్నాడని చెబుతున్నారు. వాస్తవానికి ఈ తన డేట్ లన్ని కూడా వేరే సినిమాకు కేటాయించనివి కావడంతో ఈ సినిమా కోసం ఆయన ఆ డేట్స్ లను సర్ద లేకపోతున్నాడట. మరి ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల చేస్తారా లేదా మరొకసారి వాయిదా వేస్తారా అనేది త్వరలోనే తేరాల్సి ఉంది.