Kamal Haasan Bharatheeyudu 2 movie Digital Release

Kamal Haasan: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ సినిమాకి ఇంకా కష్టాలు తగ్గలేదు.ఎన్నో ఏళ్లుగా తెరకెక్కి ఆగిపోయిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 12 న విడుదల అయింది. 28 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘భారతీయుడు’ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని ప్రతి ఒక్కరు కూడా భావించారు. అందుకే ఈ సినిమా ను శంకర్ రెండు భాగాలుగా రూపొందించగా, రెండో భాగం విషయం పక్కనబెడితే మొదటి భాగానికి సంబంధించిన ఇష్యూ రోజు రోజుకి పెద్దదైపోతుందని చెప్పాలి.

Kamal Haasan Bharatheeyudu 2 movie Digital Release

భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా కి మంచి టాక్ వస్తుందని అనుకుంటే ప్రతి ఒక్కరికి నచ్చకపోవడంతో ఈ సినిమా భారీ డిజాస్టర్ ను సొంతం చేసుకోవడం కోలుకోనియ్యకుండా చేసింది. అన్ని భాషలలోనూ ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. 250 కోట్ల బిజినెస్ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల కలెక్షన్లను మాత్రమే అందుకుంది. దీంతో ఈ భారీ నష్టాలను తీసుకువచ్చిన శంకర్ పట్ల విమర్శలు గట్టిగానే ఉన్నాయి. ఇక శంకర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఉన్న ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ నెట్ఫిక్స్ 120 కోట్లకు రిలీజ్ కు ముందే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Also Read: Double Ismart: రామ్ ‘డబల్ ఇష్మార్ట్’ విడుదల డౌటే.. వాయిదా వేస్తారా?

ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ గా కూడా ఎవరు ఎక్కువగా చూసే అవకాశాలు లేకపోవడంతో ముందు మాట్లాడుకున్న స్థాయిలో కాకుండా ఈ సినిమాకు తక్కువ అమౌంట్ ఇచ్చే విధంగా ఆలోచనలు చేపట్టిందట నెట్ ఫ్లిక్స్. అందుకే ఇప్పటిదాకా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రిలీజ్ గురించి ఎక్కడ వార్తలు బయటకు రాలేదు. దీనిపై ఓ స్పష్టత వచ్చిన తర్వాతనే డిజిటల్ లో ఈ సినిమా విడుదల అయ్యే విధంగా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భారతీయుడు2 విషయంలో కూడా నెట్ ఫిక్స్ ముందుకు వెళ్లకపోవడమే బెటర్ అని భావిస్తుందట. ఈ నేపథ్యంలో కమల్ సినిమాకు విడుదల తర్వాత కూడా ఎలాంటి స్థాయిలో కష్టాలు రావడం ఆయన కెరీర్ కి ఎంత డ్యామేజ్ చేస్తుందో చూడాలి.