Lavanya who fussed over Raj Tarun issue

Lavanya: సినిమా ఇండస్ట్రీ వాళ్లకు సంబంధించి ఏ చిన్న విషయం అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా వారికి సంబంధించిన ఎఫైర్లు, పెళ్లిళ్లు అంటే లెక్కేలేదు. అది కొన్ని సంవత్సరాల వరకు కొనసాగుతూనే ఉంటుంది.ఇక సినిమా వాళ్లు తరచూ మీడియా సమావేశంలో పాల్గొనవలసి ఉంటుంది కాబట్టి వాటికి సమాధానం చెప్పలేక చచ్చి బతుకుతుంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోప్రస్తుతం సంచలనం సృష్టించిన విషయం ఏదైనా ఉంది అంటే అది రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రాల వ్యవహారమే..

Lavanya who fussed over Raj Tarun issue

వీరిపై మీడియాలో చాలా రచ్చ జరుగుతుంది.అంతేకాదు వ్యూస్ కోసం చాలామంది యూట్యూబర్లు కూడా వీరిని ఇంటర్వ్యూలు చేస్తూ షాకింగ్ విషయాలు వీరి నుండి రాబడుతున్నారు.అంతేకాకుండా ఆడియో కాల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా రాజ్ తరుణ్ తన కొత్త సినిమా తిరగబడరా సామి మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ( Lavanya)

Also Read: Kriti Sanon: బడా బిజినెస్ మ్యాన్ తో కృతి సనన్ ఎఫై**.. 10 ఏళ్లు చిన్నవాడైనా పెళ్లికి రెడీ..?

అయితే ఈ విషయం తెలుసుకున్న లావణ్య సైలెంట్ గా ఊరుకోదు కదా.వెంటనే అక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేసింది. ప్రసాద్ ల్యాబ్ లోకి వెళ్లడానికి ప్రయత్నించింది.కానీ అక్కడే ఉన్న పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక ఈమె రచ్చ రచ్చ చేయడంతో మీడియా వాళ్ళు కూడా వచ్చారు. మీడియాతో లావణ్య మాట్లాడుతూ..నా భర్తతో మాల్వి మల్హోత్రా కి ఏమి సంబంధం.ఆమె ఎందుకు వచ్చింది.. ఆమె ఎందుకు ఆయనతో తిరుగుతుంది అంటూ మాట్లాడింది.

 Lavanya who fussed over Raj Tarun issue

సొంత భార్య భర్తల్లాగా వాళ్ళిద్దరూ ఎందుకు తిరుగుతున్నారు. ఎందుకు కలిసే వస్తున్నారు. నేను ఒక్కసారి రాజ్ తరుణ్ తో మాట్లాడాలి నన్ను వెళ్ళనివ్వండి. ఇన్ని రోజులు భయపడి దాక్కొని నేను ఏ తప్పు చేయలేదని చెప్పుకుంటున్నాడు. మరి అలాంటివాడు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు అంటూ మీడియా ముఖంగా రాజ్ తరుణ్ ని లావణ్య ప్రశ్నించింది.( Lavanya)