No Buzz on Saripodaa Shanivaram movie hero nani

Saripodaa Shanivaram: నాని హీరోగా తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ చిత్రం పై అభిమానులలో భారీ స్థాయిలో అంచనాలు అయితే ఉన్నాయి కానీ ఈ సినిమాకు సంబంధించిన బజ్ ఏ మాత్రం క్రియేట్ అవ్వకపోవడం పట్ల వారు కొంత నిరాశగా ఉన్నారని చెప్పాలి. మొదటి నుంచి కూడా ఈ సినిమా ఒకటి ఉందని కూడా సాధారణ ప్రేక్షకులకు ఏమాత్రం తెలియదు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అటెన్షన్ గ్రాబ్ చేసే అంశాలు విడుదల కాలేదు. అందువలన నాని ఈ సినిమా కోసం ఏ విధమైన పబ్లిసిటీ స్టంట్స్ చేస్తారు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.

No Buzz on Saripodaa Shanivaram movie hero nani

దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాలు ఎంతో క్లాసిక్ గా ఉంటాయి. ఇప్పటివరకు ఆయన రూపొందించిన సినిమాలన్నీ కూడా క్లాస్ సినిమాలే కావడంతో ఆయన పేరు పెద్దగా ఎవరికి తెలియదని చెప్పాలి. ఫైనల్ గా ఇప్పుడు ఒక మాస్ సినిమాను చేయడానికి ముందుకు వచ్చారు. ఈ మాస్ చిత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది అని చెబుతున్న నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకునే కొంత కంటెంట్ ను విడుదల చేయాలని సోషల్ మీడియాలోని కొంతమంది సినిమా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Also Read: Koratala Shiva: దేవర 2 కోసం కొరటాల శివ అన్ని రోజులు వెయిట్ చేయాలా?

ఏ సినిమాకైనా మంచి అటెన్షన్ రావాలి అంటే తప్పకుండా ఆ సినిమాలోని కంటెంట్ మాట్లాడాలి. అలాంటి కంటెంట్ సినిమాకు ఎక్కువ బజ్ తీసుకువస్తుంది. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలకు వెళుతూ ఉంటారు. ఆ విధంగా ‘సరిపోదా శనివారం’ కు ఇప్పటివరకు చేసిన ప్రమోషన్స్ సరిపోవడం లేదని చెప్పటంతో ఈ సినిమా టీం ప్రస్తుతం ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ జోరును పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆగస్టు 29వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏ విధమైన విజయాన్ని అందుకొని నానికి హిట్ ఇస్తుందో చూడాలి

ఇక వివేక్ ఆత్రియ దర్శకత్వంలో రెండవసారి సినిమా చేస్తున్నాడు నాని. వీరి కాంబినేషన్లో అంతకుముందు వచ్చిన ‘అంటే సుందరానికి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. నాని కెరీర్ లో నిరాశపరిచిన చిత్రంగా ఈ సినిమా ఉండిపోతుంది. మరి వీరి కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి. వివేక్ పట్ల ఉన్న నమ్మకంతో నాని రెండవసారి ఆయనకు ఛాన్స్ ఇచ్చాడు దానిని ఈ దర్శకుడు ఏ విధంగా ఉపయోగించుకుంటాడో చూడాలి.