Prabhas Doing Small films this year

Prabhas: ఏడాదికి రెండు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటానని గత ఏడాది ప్రభాస్ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే సలార్, ఆది పురుష్ చిత్రాలను పోయిన ఏడాది ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చి భారీ ఫేమ్ ను సొంతం చేసుకున్నాడు ఈ హీరో. అలా ఈ ఏడాది కూడా రెండు సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ ఏడాది లో ‘కల్కి’ సినిమాను జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ డిసెంబర్లో మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘రాజా సాబ్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశాడు.

Prabhas Doing Small films this year

కానీ ఆ సినిమాకు సంబంధించిన వర్క్ చాలా వరకు పెండింగ్ లో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ కూడా బాగానే ఉండడంతో ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలో ‘కల్కి’ సినిమా విజయం అందుకోవడంతో ప్రభాస్ సినిమాలపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకే ఏడాదికి రెండు సినిమాలు అంటే విడుదలవ్వడం చాలా కష్టమని తెలుస్తుంది.

Also Read: Bigg Boss: రేవ్ పార్టీలో పోలీసులకు అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ కంటెస్టెంట్..?

ప్రభాస్ సినిమా అనగానే ప్రతి ఒక్కరు కూడా భారీ సినిమా కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా చేయాలంటే మాత్రం రెండు సినిమాలను విడుదల చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. అయితే ఈ ఏడాది మిస్ అయినా కూడా వచ్చే ఏడాది ప్రభాస్ సినిమాల జాతర ఉండబోతుందని తెలుస్తుంది. ఏప్రిల్ లో ‘రాజాసాబ్’ సినిమా విడుదల అవుతుంది. ఇప్పటికే అనధికారికంగా డేట్ ను లాక్ చేసుకున్నారు. ఈ సినిమా లో ఐదుగురు అందమైన భామలు హీరోయిన్ లు గా నటిస్తుండగా హారర్ కామెడీ సినిమా గా ఇది తెరకెక్కింది. కంప్లీట్ మారుతి స్టైల్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోయే ‘ఫౌజీ’ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల ఉండబోతుంది అని తెలుస్తుంది. ఆగస్ట్ లో ఈ సినిమా మొదలు పెట్టబోతుండగా వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ సినిమా ను రెడీ చేయబోతున్నారు. అలా ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిని టార్గెట్ చేస్తున్నాయి ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలోని ‘స్పిరిట్’ మూవీ ‘సలార్ 2’ వ భాగం సినిమాలు ఆపై ఏడాది వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ విధంగా ప్రభాస్ 2026 వరకు ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పవచ్చు.