Prashanth Neel salaar 2 movie update

Prashanth Neel: ప్రభాస్ కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘సలార్’. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించగా కే జి ఎఫ్ దర్శకుడైన ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ప్రభాస్ అభిమానులకు తగ్గట్లుగా, అయన ఇమేజ్కు తగ్గట్లుగా రూపొందించి తన ఖాతాలో వరుసగా మూడవ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. టాలీవుడ్ కూడా ఎప్పుడు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రం పట్ల అందరిలో అంచనాలుండగా ఈ సినిమా ఏ స్థాయి లో ఉండాలో ప్రశాంత్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

Prashanth Neel salaar 2 movie update

ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ ఇప్పుడు ‘సలార్ 2’ సినిమాని కాకుండా మరొక సినిమా కోసం రెడీ అవుతూ ఉండడం ప్రభాస్ అభిమానులను ఎంతగానో కలవర పెట్టుతుంది. గత కొన్ని రోజులుగా ‘సలార్’ రెండవ భాగం సినిమా తెరకెక్కడం పట్ల అందరూ ఎంతో అయోమయాన్ని గురవుతున్నారు. అసలు ఈ సినిమా లేదని కొంతమంది చెబుతుంటే ఇంకొంతమంది ఈ సినిమా ఉంది అని చెబుతున్నారు.ఇవన్నీ అటుంచితే ఫైనల్ గా ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ వర్క్ చేస్తూ ఉన్నారని వార్తలు రావడం తో ‘సలార్ 2’ సినిమా ఉంటుందో లేదో అన్న సందేహాలు మరింత ఎక్కువ అయ్యాయి.

Also Read: Kamal Haasan: విడుదల తర్వాత కూడా కమల్ సినిమా కి కష్టాలే!!

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా యొక్క రెండవ భాగం కంటే ముందుగా ప్రశాంత్ నీల్ సినిమాను పట్టాలెక్కించాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. అదే సమయంలో బాలీవుడ్ లో చేసే ‘వార్ 2’ సినిమాలో కూడా పాల్గొనాలని భావిస్తున్నాడట. ఆ విధంగా ఎన్టీఆర్ భారీ సినిమాల లైనప్ లను ఏర్పరుచుకోవడం ఆయన అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తుంది. మరి ప్రశాంత్ నీల్ తలపెట్టిన సలార్ రెండవ భాగం సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.