Sri Reddy wants to commit suicide because of YCP

Sri Reddy: ఏంటి వైసిపి పార్టీకి సపోర్ట్ చేసే నటి శ్రీరెడ్డి వైసీపీ పార్టీ కారణంగానే సూసైడ్ చేసుకోవాలనుకుంటుందా.. ఇంతకీ వైసీపీ పార్టీ వాళ్లు ఆమెకు చేసిన అన్యాయం ఏంటి.. ఎందుకు ఆ పార్టీ కోసం సూసైడ్ చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.. రెండు మూడు సినిమాల్లో నటించి ఆ తర్వాత తన మాటలతో వివాదాస్పదనటిగా పేరు తెచ్చుకొని కొద్ది రోజులు ఇండస్ట్రీ నుండి బ్యాన్ అయింది శ్రీరెడ్డి. అయినప్పటికీ సినిమాల్లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది.

Sri Reddy wants to commit suicide because of YCP

సోషల్ మీడియాలో తనకి ఎవరు నచ్చకపోయినా వారిపై సెటైర్లు వేయడం, వారిని బూతులు తిట్టడం వంటివి చేస్తూ ఉంటుంది.అలాగే వైసిపి పార్టీకి జగన్ కి చాలా సపోర్ట్ చేస్తూ టిడిపి వాళ్ళని మెగా ఫ్యామిలీని దగ్గుబాటి ఫ్యామిలీని భూతులతో ఏకీపారేస్తుంది.అయితే అలాంటి శ్రీరెడ్డి తాజాగా తనకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని,డిప్రెషన్ లోకి వెళ్ళాను అంటూ సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ పెట్టింది. మరి ఇంతకీ శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ లో ఏముందంటే.. గత కొద్ది సంవత్సరాల నుండి వైసిపి పార్టీకి సపోర్ట్ చేసిన శ్రీరెడ్డిని ఇప్పటివరకు వైసిపి కార్యకర్తగా గుర్తించింది లేదు.( Sri Reddy)

Also Read: Prabhas: ప్రభాస్ కి ఆ కలర్ సెంటిమెంట్ అని మీకు తెలుసా.?

అలాగే ఆమె మా కార్యకర్తనే అని వైసిపి పార్టీ వాళ్లు గానీ జగన్ గానీ చెప్పుకున్నది లేదు. కానీ శ్రీరెడ్డి మాత్రం జగన్ పై ఉన్న అభిమానంతో పార్టీ కి సపోర్ట్ గా ఉంటుంది. అయితే ప్రస్తుతం తనని వైసిపి కార్యకర్తగా గుర్తించలేదనే భావనతో ఉన్న శ్రీ రెడ్డి ఈ విధంగా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం నా మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. చాలా డిప్రెషన్లో ఉన్నాను. మళ్లీ ఎప్పుడు మామూలు స్థితికి వస్తానో తెలియడం లేదు.మెంటల్ ట్రామాలోకి వెళ్తున్నాను.నాకు ఎక్కువగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలే వస్తున్నాయి..

Sri Reddy wants to commit suicide because of YCP

ఈ ఆలోచన నుండి ఎప్పుడు బయటపడతానో కూడా తెలియడం లేదు. అసలు బతికి ఉంటానో లేదో కూడా నమ్మకం లేదు. వాటి నుండి బయటపడడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. వీటన్నింటి నుండి నన్ను ఆ భద్రకాళి అమ్మవారే కాపాడాలి.ప్రస్తుతం నా పరిస్థితి చూసి చాలామంది నవ్వుకుంటున్నారు అంటూ శ్రీ రెడ్డి సంచలన పోస్ట్ పెట్టింది.ఈమె పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో వైసిపి వాళ్ళు ఈమెను గుర్తించకపోవడం వల్లే ఆ డిప్రెషన్ లోకి వెళ్లిందని కొంతమంది భావిస్తున్నారు.( Sri Reddy)

Sri Reddy – I am mentally going through deep mental… | Facebook