Parasuram: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో దర్శకులు నటులు ఇతర ఇండస్ట్రీలలో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా వారికి దేశవ్యాప్తంగా క్రేజ్ రావడం జరుగుతుంది. అంతేకాదు ఒక సినిమా ఇండస్ట్రీలో సదరు దర్శకుడిని లేదా నిర్మాతని నమ్మని వారు ఉంటే వారు తమ అదృష్టాన్ని ఇతర భాషలలో పరీక్షించుకుంటున్నారు. అక్కడ సక్సెస్ అయ్యి తిరిగి వారి సొంత ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పటిదాకా చాలామంది దర్శకులు ఆ విధంగానే చేసి మళ్లీ దర్శకులుగా నిలబడ్డారు.

Director Parasuram in Bollywood Movie

ప్రస్తుతం దర్శకుడు పరశురాం పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. తెలుగులో అరడజను దాక సినిమాలు చేసిన ఈ దర్శకుడు ఇటీవల చేసిన రెండు సినిమాలతోనూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లను అందుకున్నాడు. దాంతో ఇక్కడ దర్శకులు హీరోలు నిర్మాతలు ఎవరు ఈ దర్శకుడిని నమ్మడానికి ముందుకు రావడం లేదేమో.. ఇప్పుడు బాలీవుడ్లో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

Also Read: Gautam Gambhir: సిక్సుల వీరులతో బౌలింగ్.. గంభీర్ కోచింగ్ స్టయిల్ అదుర్స్‌

వాస్తవానికి పరశురామ్ కి ఒక స్టైల్ ఉంటుంది. అలాంటి స్టైల్ లోనే ఈసారి కల్ట్ స్టోరీ రాసుకున్నాడట. ఈ చిత్రం “యానిమల్” స్థాయిలో వినూత్నమైన ఆలోచన అని, పరశురామ్ ఈ జానర్‌ లో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడని సమాచారం. పరశురామ్ ప్రస్తుతం ఇద్దరు బాలీవుడ్ హీరోలతో టచ్‌లో ఉన్నాడు. “యానిమల్” హిట్ తర్వాత సౌత్ దర్శకుడిపై బాలీవుడ్ హీరోల ప్రేమ రోజురోజుకూ పెరుగుతోంది. దక్షిణాదికి, ముఖ్యంగా తెలుగుకు చెందిన దర్శకులు కథ చెప్పడానికి వచ్చినప్పుడు, వారు ఆసక్తి చూపారు. అందుకే పరశురామ్ కథ వినిపించేందుకు అక్కడి హీరోలు సిద్ధమయ్యారు. ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ ఎలా ఉన్నా, నిర్మాత దిల్ రాజు కూడా పరశురాంతో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు.