Lavanya slapped sandle him in front of everyone

Lavanya: లావణ్య రాజ్ తరుణ్ ల వివాదం రోజురోజుకీ ముదురుతోంది.. అయితే కొంతమంది నిజంగానే వీరి పర్సనల్ ఇష్యూ అని అంటే మరి కొంతమందేమో రాజ్ తరుణ్ సినిమా ప్రమోషన్స్ స్టంట్ ఏమో అని అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు ప్రమోషన్స్ చాలా వెరైటీగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ కూడా ఇలా చేస్తున్నారు కావచ్చు అని భావిస్తున్నారు.కానీ ఇది నిజంగా వివాదమే.కానీ రాజ్ తరుణ్ కి మాత్రం ప్రమోషన్ లాగా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు కొంతమంది సినీ జనాలు.

Lavanya slapped sandle him in front of everyone

అయితే రీసెంట్ గా తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ప్రసాద్ ల్యాబ్ లోకి వెళ్లడానికి ప్రయత్నించిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో లావణ్య పెద్దగా అరుస్తూ నేను నా భర్తను కలవాలి అంటూ రచ్చ రచ్చ చేసింది. అయినప్పటికీ పోలీసులు వెళ్లనివ్వలేదు. అంతేకాకుండా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి కూడా రచ్చ చేసి రాజ్ తరుణ్ తో మాట్లాడాలని లావణ్య చెప్పింది. అయితే తాజాగా రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ భాష లావణ్య ఇద్దరు ఒక డిబేట్లో పాల్గొన్నారు. అయితే ఈ డిబేట్లో ఒక ఊహించని పరిణామం జరిగింది. (Lavanya )

Also Read: RC16: రంగస్థలం ఫార్ములా ఫాలో కాబోతున్న రామ్ చరణ్!!

అదేంటంటే.. రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ భాషాని లావణ్య చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం ఇదే న్యూస్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. మరి లావణ్య చెప్పుతో కొట్టేంత తప్పు పని శేఖర్ బాషా ఏం చేశారో ఇప్పుడు చూద్దాం.. లావణ్య రాజ్ తరుణ్ ల వివాదంలో రాజ్ తరుణ్ తరఫున నిలబడుతూ లావణ్య గురించి ఎన్నో విషయాలు మీడియాలో వైరల్ చేస్తున్నారు శేఖర్ భాష.ఈ నేపథ్యంలోనే తాజాగా పాల్గొన్న ఓ డిబేట్లో లావణ్య నిజస్వరూపం బయట పెడుతూ..

 Lavanya slapped sandle him in front of everyone

ఆమె చిన్నపిల్లలకి కూడా డ్రగ్స్ అమ్ముతుందని చెప్పడంతో ఫైర్ అయిన లావణ్య డిబేట్ జరుగుతుంది అని కూడా చూడకుండా లైవ్ లోనే శేఖర్ భాషాని చెప్పుతో కొట్టింది.దాంతో ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.అంతేకాదు లావణ్యకి డ్రగ్స్ ఎవరు అమ్ముతారో ఆయన కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తారు అని శేఖర్ భాష చెప్పడంతో అక్కడి నుండి లావణ్య వెళ్ళిపోయింది. ప్రస్తుతం లావణ్య శేఖర్ భాషాని చెప్పుతో కొట్టిన వీడియో మాత్రం మీడియాలో చాలా వైరల్ అవుతుంది. మరి రాజ్ తరుణ్ లావణ్య వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.(Lavanya )