Prabhas guest roles in tollywood movies

Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రం పైన ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటినుంచి భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పరచుకోవడం నిజంగా ప్రభాస్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన గత సినిమాలన్నీ కూడా భారీ స్థాయిలో రూపొందించిన సినిమాలే అవడంతో ఇకపై చేసే సినిమాలు అన్ని కూడా అదే విధంగా ఉంటాయని అందరూ అనుకున్నారు.

Prabhas April Month Sentiment for Raja SaaB

కానీ అనూహ్యంగా చిన్న బడ్జెట్ చిన్న తరహా సినిమాలను చేయాలని ఆయన భావించి మారుతికి సినిమా చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా ‘రాజా సాబ్’ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది.హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవలే ఒక గ్లింప్స్ కూడా విడుదల అయింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది అని చెప్పాలి. గతంలో ప్రభాస్ కనిపించిన వింటేజ్ లుక్కులో కనిపించి ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత రొమాంటిక్ లుక్కులో కనిపించాడు.

Also Read: Gautam Gambhir: సిక్సుల వీరులతో బౌలింగ్.. గంభీర్ కోచింగ్ స్టయిల్ అదుర్స్‌

డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఏక్ నిరంజన్ టైంలో ఎలాంటి ప్రభాస్ ను అయితే మనం చూసామో అలాంటి ప్రభాస్ ఈ సినిమాలో చూడబోతున్నాము. ఈ లుక్ పట్ల అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమా కోసం కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమా ఏప్రిల్ లో విడుదలవడం అయనకు కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. ఆ సమయంలో ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు విడుదల కాగా అవి భారీ సక్సెస్ను అందుకున్నాయి.

ఇప్పటివరకు ప్రభాస్ కెరియర్ లో అత్యధిక సినిమాలు ఏప్రిల్ నెలలోనే విడుదలవడం జరిగాయి. పౌర్ణమి, మున్నా, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి 2 వంటి చిత్రాలు ఏప్రిల్ నెలలో విడుదలయి ఆయనకు మంచి సక్సెస్ను తెచ్చి పెట్టాయి. ఆ విధంగా రాజా సాబ్ కూడా ఇప్పుడు ఏప్రిల్ నెలలో విడుదల కాబోతూ ఉండటం ఆ సక్సెస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని అభిమానులు నమ్మడం జరుగుతుంది. మరి దానిని మారుతి ఏ విధంగా ఉపయోగించుకుంటాడో చూడాలి.