RC16: ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుని గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. ఈ సినిమా కంటే ముందే రామ్ చరణ్ లోని సత్తా ‘రంగస్థలం’ అనే సినిమా ద్వారా దేశవ్యాప్తంగా చాటి చెప్పగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చరణ్ అంటే తెలియని వారు ఉండరు. ఆ విధంగా ‘రంగస్థలం’ సినిమా చరణ్ కెరియర్ లోనే ఎంతో కీలకమైన సినిమా అని చెప్పాలి. తనని నటుడుగా ఒక మెట్టుకు తీసుకువెళ్లిన సినిమా రంగస్థలం. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నెంబర్స్ చూసేలా ఆ సినిమా చేసిందని చెప్పాలి.

Ram Charan Sentiment for RC16 Movie

ఎప్పటికీ రామ్ చరణ్ కెరియర్ లో మంచి సినిమాగా మిగిలిపోయిన రంగస్థలం సినిమా యొక్క సెంటిమెంట్ ను ఇప్పుడు తాను చేయబోయే కొత్త సినిమా కోసం వాడబోతున్నారట. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రం కొంత ఆలస్యం అవుతూ ఉండడంతో ఇప్పుడు మరొక సినిమాను మొదలు పెట్టాడని చెప్పాలి. ఉప్పెన చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని 100 కోట్ల మార్కును కొట్టిన దర్శకుల సరసన నిలబడ్డ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక క్రీడా నేపథ్యంలోని సినిమాను చేస్తున్నాడు.

Also Read: Gautam Gambhir: సిక్సుల వీరులతో బౌలింగ్.. గంభీర్ కోచింగ్ స్టయిల్ అదుర్స్‌

ఉత్తర ప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో రూపాందుతున్న ఈ సినిమాలో ఎన్నో విశేషాలు ఉన్నాయని చిత్ర బృందం చెబుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో తన మేకవర్ను వెరైటీగా చేయబోతున్నాడట రామ్ చరణ్. అంతే కాదు రంగస్థలంలో తాను కనిపించిన లుక్ లోనే కనిపించబోతున్నాడని ఆ సెంటిమెంటు ప్రకారం ఆ లుక్ లో కనిపిస్తే బాగుంటుంది అని రామ్ చరణ్ కోరినట్లుగా తెలుస్తుంది. కథ కూడా ఆ విధమై గెటప్ డిమాండ్ చేయడంతో దర్శకుడు కూడా కాదనలేక పోయాడని చెబుతున్నారు. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా తొందర్లోనే ఈ చిత్రం మొదలు కాబోతోంది. వచ్చే ఏడాది ఆఖరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.