Ravi Teja: రవితేజ హీరోగా నటిస్తున్న వరుస చిత్రాలు ప్రేక్షకులను భారీ స్థాయిలో నిరాశ పరుస్తున్నాయని చెప్పాలి. ఆయన గత చిత్రాలు ఈగల్,టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. హిట్ లు, ఫ్లాప్ లు అనే సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు రవితేజ. ఆ విధంగా ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే ఓ సినిమాతో ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Ravi Teja New Movie Need to get Hit

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా రవితేజ హరీష్ శంకర్ తో కలిసి చేస్తున్న మూడవ సినిమా కావడం పట్ల ఇప్పుడు ఈ సినిమా పై అందరిలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలోనే వీరి గత రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు చేస్తున్న ఈ మూడవ సినిమా హిట్ అయ్యి వారికి హ్యాట్రిక్ విజయాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఏదేమైనా రవితేజ ఈ సినిమాతో హిట్టు కొట్టడం తప్పనిసరి అవసరం అని చెప్పాలి.

Also Read: Gautam Gambhir: సిక్సుల వీరులతో బౌలింగ్.. గంభీర్ కోచింగ్ స్టయిల్ అదుర్స్‌

ఎందుకంటే ఆయన గత రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఆయా సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను చూసేలా చేయగా రవితేజతో సినిమా చేయాలంటేనే కొంతమంది నిర్మాతలు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆయన చేతిలో సినిమాలు కూడా పెద్దగా ఏమీ లేవని చెప్పాలి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా తర్వాత ఆయన ఒకరిద్దరు దర్శకులతో సినిమాలు చేస్తున్నప్పటికీ అవి భారీ సినిమాలు కాకపోవడంతో రవితేజ అభిమానులు మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇస్తున్నారు.

గతంలోలా ఓటీటీలు సినిమాలను కొనే విషయంలో పెద్దగా ముందడుగు వేయడం లేదు. రవితేజ రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటుంది. ఆ విధంగా రవితేజ సినిమాలు భవిష్యత్తులో ఆడాలి అంటే ఆయన మంచి కథలను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు విడుదలయ్యి ప్రేక్షకులలో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాబోతుంది.