Allu Sirish 'Buddy' Movie Review and Rating

నటీనటులు: Allu Sirish, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ముకేష్ రుషి, రవిప్రకాష్ తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిళ
ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్
రచన: సాయి హేమంత్
నిర్మాత: జ్ఞానవేల్ రాజా
స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శామ్ ఆంటన్

అల్లు హీరో శిరీష్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన సినిమా ‘బడ్డీ’.శామ్ ఆంటోన్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించిన చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోగా అల్లు శిరీష్ కి ఈ సినిమా ఎంతో కీలకం.యాక్షన్, కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా లో గాయత్రి భరద్వాజ్-అజ్మల్ అమీర్-ముకేష్ రుషి-రవిప్రకాష్ తదితరులు నటించగా ఎప్పటినుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ కి ఈ సినిమా ద్వారా తాను కోరుకున్న హిట్ లభించిందా అనేది చూడాలి.

Allu Sirish ‘Buddy’ Movie Review and Rating

కథ: వృత్తిరిత్యా పైలెట్‌ అయిన ఆదిత్య(అల్లు శిరీష్‌).. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అక్కడ పనిచేసే పల్లవితో మాట కలుస్తుంది. ఒకరినొకరు చూసుకోకుండానే మనసులు కూడా కలుస్తాయి. ఆదిత్యకు తన మనసులో మాట చెప్పే రోజు కోసం పల్లవి ఎదురుచూస్తూవుంది. సరైన సందర్భం చూసి, ఆదిత్యకు ఐలవ్యూ చెప్పేయాలనుకుంది. కానీ.. తను చేసిన చిన్న పొరపాటు వల్ల ఆదిత్య ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయ్యాడు. దాంతో నేరుగా వెళ్లి ఆదిత్యకు క్షమాపణ చెబుదామనుకుంది. ఇంతలోనే తను కిడ్నాప్‌ అయ్యింది. ఈ క్రమంలో జరిగిన గొడవలో తను కోమాలోకి వెళ్లగా.. ఆమె ఆత్మ ఓ టెడ్డీబేర్‌లోకి వెళ్లింది. ప్రాణంతో ఉండగానే ఆత్మ బయటకు రావడం ఏంటి? అసలు పల్లవిని కిడ్నాప్‌ చేసిందెవరు? ఈ కిడ్నాప్‌కీ హాంకాంగ్‌లో ఉన్న అర్జున్‌కుమార్‌వర్మ(అజ్మల్‌)కూ ఉన్న సంబంధం ఏంటి? పల్లవిని ఆదిత్య ఎలా కాపాడాడు? అ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

నటీనటులు: అల్లు శిరీష్ చాలా బాగా కనిపించాడు. తన పాత్ర మేరకు ఆకట్టుకున్నాడు.గత సినిమా కంటే మంచి పరిణితి కనపరిచాడు. ఎక్కువ ఫోకస్ బడ్డీ మీదే ఉంటుంది కాబట్టి అల్లు శిరీష్ బాగా నటించే అవకాశం పెద్దగా రాలేదు. మంచి హావభావాలు కనపరిచాడు. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ పాత్ర పరిశీ చాలా తక్కువ. స్క్రీన్ పైన ఎక్కవుగా సేపు కనిపించలేదు. కానీ ఆమె గ్లామర్ సినిమా కి ఉపయోగపడింది. ప్రిషా రాజేష్ సింగ్ పర్వాలేదనిపించారు. అజ్మల్ అదరగొట్టాడు. ముఖేష్ ఋషి ఆకట్టుకున్నాడు. కమెడియన్ అలీ తన జోకులతో నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగితా నటీనటులు పర్వాలేదనిపించారు.

సాంకేతిక నిపుణులు: నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. విజువల్స్ సహజంగా కనిపిస్తాయి. వి ఎఫ్ ఎక్స్ వర్క్ బాగుంది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ పర్వాలేదు. అయితే అయన రేంజ్ లో లేవు. రూబెన్ ఎడిటింగ్ బెటర్ గా ఉంది. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు సాన్ ఆంటోన్ ఈ చిత్రానికి మంచి కథ రాసి దానికి మంచి స్క్రీన్ ఫ్లూ చేసి సరైన న్యాయం చేశాడని అని చెప్పాలి. మంచి ఎంగేజింగ్ డైరెక్షన్ తో ప్రేక్షకులను ఆసక్తి పరిచాడు. స్క్రీన్ ప్లే లో చాలా అంశాలు ఊహించదగిన రేంజ్ లోనే ఉన్నా అవి ఎగ్జైట్మెంట్ ను కలిగిస్తాయి. తెలుగు సంభాషణలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కాన్సెప్ట్, కథ

బడ్డీ

ఎమోషన్స్

మైనస్ పాయింట్స్ :

సాగతీత సీన్స్

రేటింగ్ : 3/5