Balakrishna publicly insulted Nagarjuna in that movie event

Balakrishna: అక్కినేని నాగార్జున,నందమూరి బాలకృష్ణ మధ్య సఖ్యత లేదు అనేది చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న వీరిద్దరూ హీరోలు ప్రస్తుతం బద్ధ శత్రువులుగా ఉన్నారు. ఇక ఆ మధ్యకాలంలో బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ అణుచిత వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ కూడా భగ్గుమంది.అయితే బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు తో కొన్ని సినిమాల్లో కూడా నటించారు.ఆయన తనకు బాబాయ్ లాంటి వారు అంటూ మాట్లాడారు.

Balakrishna publicly insulted Nagarjuna in that movie event

అయినప్పటికీ ఇలా అక్కినేని తొక్కినేని అని మాట్లాడడం అక్కినేని ఫ్యాన్స్ సహించలేకపోయారు. దాంతో బాలకృష్ణ పై ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే గతంలో బాలకృష్ణ, నాగార్జున మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉండేవారు.వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో నాగార్జున తన కొడుకు నాగచైతన్య ఫస్ట్ సినిమా జోష్ ఆడియో లాంచ్ ఈవెంట్ కి బాలకృష్ణని ఆప్యాయంగా పిలిచి బాలా నువ్వు కచ్చితంగా ఈవెంట్ కి రావాలి అని చెప్పారట. దానికి బాలకృష్ణ కూడా పాజిటివ్ గా స్పందించి..(Balakrishna)

Also Read: Lavanya: అందరి ముందే ఆయన్ని చెప్పుతో కొట్టిన లావణ్య..?

మన కుటుంబంలో జరిగే ఈవెంట్ కి నేను రాకుండా ఉంటానా అని సమాధానం ఇచ్చారట. ఇక నాగార్జున నాగచైతన్య మొదటి సినిమా జోష్ ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ కి దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు రాజకీయ నాయకులు, అక్కినేని ఫ్యామిలీ, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు డైరెక్టర్లు ఇలా అందరూ హాజరయ్యారు.ఇక ఈవెంట్ కి బాలకృష్ణ కూడా వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో బాలకృష్ణ ఒక వారసత్వాన్ని నిలబెట్టడం అంటే అనుసరించడం కాదు అనుకరించడం అంటూ మాట్లాడారు.

Balakrishna publicly insulted Nagarjuna in that movie event

అంతేకాదు ఈ ఈవెంట్లో నాగార్జున గురించి మాట్లాడుతూ.. నాగార్జునకి కూడా అచ్చం నాగేశ్వర రావు గారికి ఉన్న పోలికలే వచ్చాయి.ఆయన పక్కా కమర్షియల్ బిజినెస్ మాన్.. అంటూ స్టేజ్ మీదే నాగార్జున పై సెటైర్ వేశారు. ఇక ఆయన వేసిన సెటైర్ కి నాగార్జున నవ్వాలో కోపగించుకోవాలో తెలియక షాక్ లో ఉండి కాస్త స్మైల్ ఇచ్చారు. ఇక ఈ సెటైర్ అప్పట్లో టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. బాలకృష్ణ సరదాగా మాట్లాడుకుంటూనే నాగార్జున ని అవమానించారని కొంతమంది భావించారు. అలా వీరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నాగార్జున,బాలకృష్ణ మధ్య దూరం పెంచాయట.(Balakrishna)