Chiranjeevi vishwambhara cinema craze

Chiranjeevi: టాలీవుడ్ చిత్ర పరిశ్రమ యొక్క సినిమాలు ఏ స్థాయిలో హడావుడి చేస్తున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కల్కి2898’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి ఆదరణ అందుకుంది. ఇండియన్ సినిమాలకు గతంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కేది కాదు.. కానీ ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాలను సైతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తూ ఆయా సినిమాలకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చేలా చేస్తున్నారు.

Chiranjeevi vishwambhara cinema craze

ముఖ్యంగా భారీ నేపథ్యం సినిమాలకు పట్టం కడుతున్నారు ప్రేక్షకులు. విజువల్ గా వండర్ అనిపించే సినిమాలకు భారీ కాన్వాస్ యాక్షన్ సినిమాలకు విపరీతంగా తరలి వెళ్తున్నారు. ఆ విధంగా తెలుగులో ఇప్పుడు రాబోయే ఓ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Also Read: VD12: అందుకే #VD12 ని మార్చి లో రిలీజ్ చేస్తున్నారా?

విజువల్ ఎఫెక్ట్స్ భారీ స్థాయిలో ఉంటాయని చిత్ర బృందం మొదటి నుంచి చెబుతున్న నేపథ్యంలో ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల, అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తుందని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో ఈ సినిమాలో నటించడం నిజంగా ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని చెప్పవచ్చు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన గత సినిమా ‘బింబిసార’ ప్రేక్షకులను భారీ స్థాయిలోనే ఆకట్టుకుంది.

ఈ సినిమాలో కూడా ఓ సరికొత్త లోకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట. దానికి సంబంధించిన సెటప్ కూడా కొత్తగా ఉండబోతుందట. ఈ నెల మూడో తారీకు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతూ ఉండగా అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ ఇప్పటికే తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతుంది. కీరవాణి సంగీత సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.