Kajal Aggarwal wanted to go to that star producer's house as a daughter-in-law

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్… రీసెంట్ గానే భారతీయుడు 2 సినిమాతో మన ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో అంత గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ భారతీయుడు -2 సినిమాలో ఈమె పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే కాజల్ అగర్వాల్ సత్యభామ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.ఇక గత ఏడాది భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అయితే కాజల్ అగర్వాల్ సినీ కెరియర్ కాస్త పక్కన పెడితే ఆమె తన పర్సనల్ కెరియర్లో చాలా హ్యాపీగా ఉంది.

Kajal Aggarwal wanted to go to that star producer’s house as a daughter-in-law

గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తను పెళ్లాడి ఒక బాబుకు జన్మనిచ్చి చాలా హ్యాపీగా తన వ్యక్తిగత జీవితాన్ని ముందుకు సాగిస్తోంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ మీద అప్పట్లో ఓ రూమర్ వినిపించింది. అదేంటంటే గౌతమ్ కిచ్లూ కంటే ముందే కాజల్ అగర్వాల్ ఓ తెలుగు ప్రొడ్యూసర్ ఇంటికి కోడలుగా వెళ్లాలని చూసింది అంటూ టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో గట్టిగా అనిపించింది. (Kajal Aggarwal)

Also Read: Balakrishna: ఆ సినిమా ఈవెంట్ లో పబ్లిక్ గా నాగార్జునని అవమానించిన బాలకృష్ణ..?

దాంతో కాజల్ నిజంగానే ఆ హీరోయిన్ ఇంటికి కోడలుగా వెళ్లబోతుందని అందరూ భావించారు.ఇక కాజల్ అగర్వాల్ ఏ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలుగా వెళ్లబోతుందని భావించారో తెలుసా.. ఆయన ఎవరో కాదు దగ్గుబాటి సురేష్ బాబు.. సురేష్ బాబు కొడుకు రానా,కాజల్ కాంబినేషన్లో వచ్చిన సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి.

Kajal Aggarwal wanted to go to that star producer's house as a daughter-in-law

దాంతో రానాని కాజల్ పెళ్లి చేసుకోబోతుందని, టాలీవుడ్ బడా ఇంటికి కోడలుగా వెళ్ళిపోతుంది అంటూ ఇలా ఎన్నో వార్తలు వినిపించాయి.కానీ చివరికి ఇందులో ఎలాంటి నిజం లేదని,అది కేవలం సినిమా షూటింగ్ సమయంలో వచ్చిన డేటింగ్ వార్తలేనని తేటతెల్లమైంది.ఎందుకంటే కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లూ తో దాదాపు పది సంవత్సరాలు రిలేషన్ లో ఉంది.(Kajal Aggarwal)