No effect of Dhanush in telugu states

Dhanush: చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటూ ఏడాదికి రెండు సినిమాల నైనా విడుదల చేసే హీరోలలో ధనుష్ కూడా ఒకరు. ఏడాది కాలంలో మూడు వంద కోట్ల సినిమాలను అందించి నేషనల్ అవార్డు విన్నర్ గా కూడా ఎంపికైన ధనుష్ నటించిన తాజా చిత్రం ‘రాయన్’. ఈ సినిమా కూడా కేవలం ఆరు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ను అందుకుని ఆయనకు భారీ స్థాయిలో క్రేజ్ ను తీసుకువచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమాకు తెలుగులో పెద్దగా ఆదరణ దక్కలేదని చెప్పవచ్చు.

No effect of Dhanush in telugu states

ఇతర హీరోలతో పోలిస్తే ధనుష్ కు తెలుగులో మంచి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకు కూడా ప్రేక్షకులు భారీగా తరలివస్తూ ఉంటారు. అయితే ‘రాయన్’ సినిమాకి పాజిటివ్ రాకపోవడమే ఈ సినిమాను ప్రేక్షకులు చూడడానికి రాలేదు అని విశ్లేషకులు చెబుతున్నారు. అలా అని ఈ చిత్రానికి నెగటివ్ టాక్ కూడా రాలేదు. ఓల్డ్ స్టోరీ అయినప్పటికీ కూడా ఈ సినిమాలోని కొన్ని అంశాల కోసం తప్పకుండా ఈ సినిమా చూడవచ్చు అనే అభిప్రాయం తెలుగువారిలో నెలకొంది. అందుకే మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

Also Read: Chiranjeevi: చిరు సినిమా కు పెరుగుతున్న క్రేజ్.. కల్కి తర్వాత అదే!!

దానికి తోడు సందీప్ కిషన్ కూడా ఈ సినిమాలో ఉండడంతో తెలుగువారిని మరింత ఆసక్తిపరిచింది. ఈ సినిమా ఆ విధంగా తెలుగులో వీక్ డేస్ లో ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాకపోవడంతో పెద్దగా కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద తగ్గాయని చెబుతున్నారు. ఇతర భాషలలో జోరుగా ఈ సినిమా వసూలను రాబట్టుకోగా ఈ ఏడాది తమిళనాడులో విడుదలైన సినిమాల యొక్క కలెక్షన్లను దాటి మరొకసారి ధనుష్ నెంబర్ వన్ హీరో అని గుర్తు చేసింది.

తెలుగులో కూడా ఆయన నటించిన వరుస సినిమాలను విడుదల చేస్తూ క్రేజీ హీరోగా మారిన ధనుష్ గత ఒకటి రెండు సినిమాలు గా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. ప్రస్తుతం తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల తో కలిసి ‘కుబేర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నాగార్జున కూడా మరొక హీరోని హీరోగా నటిస్తున్నాడు రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.