Pushpa 2 movie craze in bollywood industry

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ‘పుష్ప2’ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది అనేది ప్రతి ఒక్కరు చెబుతున్న మాట. చాలా రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. పలుమార్లు విడుదల కూడా వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా మొదలైనప్పుడు ఒక్క పార్ట్ గానే తీయాలనుకున్నారట. కానీ మేకింగ్ దశలో ఈ చిత్రం రెండు భాగాలుగా మారింది.

Pushpa 2 movie craze in bollywood industry

మొదటి భాగానికి రెట్టింపు కలెక్షన్లు రావాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎక్కువ రోజులు తెరకెక్కుతూ ఉండడం ఒక రకంగా ప్లస్ అయినా కూడా అదే ఈ చిత్రానికి మైనస్ అవుతుంది అని చెప్పాలి. అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యం అవ్వడం పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడడం వంటివి చూస్తుంటే ఈ సినిమాకి మొదట్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదని చెప్పవచ్చు. రెండు వారాల్లో రిలీజ్ కావలసిన సినిమా ఏడాది చివరికి పోయేసరికి ఇటు అభిమానులు కూడా ఎంతగానో నిరాశ పడ్డారు.

Also Read: Mrunal Thakur: మృణాల్ కెరీర్ ను కాపాడేది ఆ సినిమానే!!

కారణాలు ఏమైనా కూడా ఇన్ని రోజులుగా సినిమాను వాయిదా వేస్తూ రావడం సినిమా క్రేజ్ కు భారీ స్థాయిలో గండి పడింది. షూటింగ్ కూడా సజావుగా జరుగుతుందా అంటే లేదట. కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడుతూ మరికొన్ని రోజులు షూటింగ్ జరుగుతూ ఇన్ని రోజులు వచ్చింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ విదేశాల్లో ఉన్న నేపథ్యంలో ఇతరులను సంబంధించిన సీన్ లను చిత్రీకరిస్తున్నారట. ఇక బాలీవుడ్ లో ఈ సినిమాకు ఎక్కువ బజ్ ఉన్న నేపథ్యంలో రెండవ భాగానికి సంబంధించి ప్రేక్షకులు నిరాశలో ఉన్నారట. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల ఏమాత్రం అటు ఇటు అయినా నార్త్ ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఎలాంటి ఆసక్తి ఉండకపోవచ్చు. కాబట్టి అనుకున్న తేదీకి ఈ సినిమా విడుదల చేయడం తప్పని సరి.