Raj Tarun's private photo with the heroine was revealed by Lavanya

Lavanya: రాజ్ తరుణ్, లావణ్యల వివాదం మీడియాలో దుమారం సృష్టిస్తోంది.ఇక వీరి వ్యవహారంతో మీడియా పండగ చేసుకుంటుంది అనుకోండి.ఎందుకంటే కొత్త కొత్త విషయాలు బయట పెడుతూ ఎంతో వైరల్ అవుతుంది.ఈ న్యూస్ రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది. అయితే తాజాగా లావణ్య చేసిన పనికి మీడియాలో పెద్ద దుమారం అయిపోయింది. ఎందుకంటే లావణ్య,రాజ్ తరుణ్ సీక్రెట్ గా ఓ హీరోయిన్ కి లిప్ లాక్ ఇచ్చిన ఫోటోని తన ఫోన్ ద్వారా మీడియాకి చూపెట్టింది.

Raj Tarun’s private photo with the heroine was revealed by Lavanya

దాంతో ఈ ఫోటో చూసిన చాలా మంది జనాలు రాజ్ తరుణ్ నిజస్వరూపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయిగా అంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో పెద్ద వివాదం సృష్టించింది. మరి ఇంతకీ రాజ్ తరుణ్ లిప్ లాక్ పెట్టింది ఏ హీరోయిన్ కి.. లావణ్య తనఫోన్లో చూపించింది ఎవరి ఇమేజ్ అనేది ఇప్పుడు చూద్దాం. లావణ్య రాజ్ తరుణ్ కి సంబంధించిన ఒక్కొక్క విషయాన్ని బయట పెడుతూ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. (Lavanya)

Also Read: Andrea: వయసుతో పని లేకుండా ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమలో పడ్డ సునీల్ హీరోయిన్.?

అయితే తాజా మీడియా సమావేశంలో రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేస్తూనే తన ఫోన్లో రాజ్ తరుణ్ అమ్మాయితో ఏ పని చేస్తున్నారో చూడండి అంటూ ఫోటో చూపెట్టింది. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన శాలిని పాండే.ఇక రాజ్ తరుణ్, శాలిని పాండే కాంబినేషన్లో ఇద్దరిలోకం ఒకటే అనే సినిమా వచ్చింది.

Raj Tarun's private photo with the heroine was revealed by Lavanya

ఇక ఈ సినిమా హీరోయిన్ తో కూడా రాజ్ తరుణ్ డేటింగ్ చేశారని లావణ్య గతంలో అరపించింది.ఇక దానికి సంబంధించిన ఆధారాలు లావణ్య చూపెట్టింది. ఇవే కాదు ఇంకా తన దగ్గర చాలా ఉన్నాయి అంటూ మీడియా సమావేశంలో మాట్లాడింది. ఆ మీడియా సమావేశంలో లావణ్య తన ఫోన్లో ఉన్న రాజ్ తరుణ్ ఫోటో చూపిస్తూ ఆ హీరోయిన్ ఎవరో చూడండి..ఇద్దరి లోకం ఒకటే హీరోయిన్ అని చెప్పింది.ప్రస్తుతం రాజ్ తరుణ్,శాలిని పాండే కి లిప్ లాక్ పెట్టినా ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.(Lavanya)