Remake king harish shankar mister bachchan

Mister Bachchan: రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా పైన ఇప్పుడు అందరి చూపు ఉందని చెప్పాలి.మాస్ చిత్రాల దర్శకుడైన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా బాలీవుడ్ లో తెరకెక్కిన సినిమా ‘రైడ్’ చిత్రం కు ఇది రీమేక్ గా రాబోతుంది. రీమేక్ సినిమాలను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా, వారి అభిరుచికి తగ్గట్టుగా హీరోల అభిమానుల రేంజ్కు తగ్గట్టుగా సినిమాలను చేయడం హరీష్ శంకర్ కు అలవాటే. ఇప్పటిదాకా ఆయన రీమేక్ సినిమాలు చేసిందే ఎక్కువ.గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలు అలా చేసి హిట్ కొట్టాడు.

Remake king harish shankar mister bachchan

అలాంటి సమయంలో రవితేజ లాంటి సక్సెస్ ఫుల్ హీరోతో ఈ విధంగా రీమేక్ సినిమా చేయాలనుకోవడం నిజంగా మంచి విషయమే. హరీష్ కేవలం రీమేక్ సినిమాలు చేస్తున్నాడేంటి అని ఆయనపై ఇలాంటి విమర్శలు బాగానే ఉన్నాయి. వాటిని కాదని మళ్లీ ఒక రీమేక్ సబ్జెక్టు తో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పలు సినిమాలు వస్తున్నా కూడా ఏ సినిమాకి లేనంత బజ్ ఈ చిత్రానికి ఏర్పడింది.

Also Read: Sreeleela: తెలివైన పని చేస్తున్న శ్రీలీల.. అవకాశాలు తగ్గడంతో అలా!!

దీనికి తోడు పలు కాంట్రవర్షియల్ విషయాలు కూడా ఈ సినిమా క్రేజ్ పెరగడానికి కారణం అవుతున్నాయి. అయితే ఇక్కడ హరీష్ శంకర్ యొక్క తెలివిని మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఎంటర్టైనర్ సినిమాలు లైక్ చేసే ప్రేక్షకులను అలరించిన హరీష్ ఈ సినిమాను కూడా అదే విధంగా రూపొందించి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో పాటు మరొక యాక్షన్ సినిమా కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఎక్కువమంది మాట్లాడుకోవడం పట్ల హరీష్ రాబట్టిన బజ్ గురించి మాట్లాడాలి.

రీమేక్ సినిమాలను తెలుగు సినిమాల లాగానే చూపించే విధానం చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమాను మళ్ళీ ఒరిజినల్ భాషలో రీమేక్ చేయాలనిపించే విధంగా చాలా మార్పులు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా హరీష్ శంకర్ దర్శకత్వం ప్రతిభ వలన ఈ సినిమాకు ఇంతటి స్థాయిలో క్రేజ్ వచ్చిందని చెప్పాలి. మరి ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో.. వారి అంచనాలను ఏ విధంగా అందుకోగలుగుతుందో.. అనే విషయం తెలియాల్సి ఉంది.