Sreeleela into bollywood Industry

Sreeleela: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సునామిలా వచ్చి వరుస సినిమా అవకాశాలను అందుకున్న హీరోయిన్ శ్రీలీల. ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసులను దోచుకుని మేకర్స్ ను ఆకర్షించి పెద్దపెద్ద హీరోల సినిమా అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ విధంగా ఇటు యువ హీరోలతో అటు సీనియర్ హీరోలతో జతకట్టి నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది. అయితే ఎంత స్పీడుగా అయితే ఆమె నెంబర్ వన్ స్థానానికి వెళ్లిందో అంతే స్పీడుగా ఆమె కెరియర్ కిందకు జారిందని చెప్పాలి. ఎందుకో ఆమెను తమ సినిమాలలో పెట్టుకున్న చాలా మంది నిర్మాతలు ఆమెను పక్కన పెట్టేశారు.

Sreeleela into bollywood Industry

2022, 2023 సంవత్సరాలలో ఈమె చేతిలో డజను కు పైగానే సినిమాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఫ్లాప్ అవడం, అన్ని సినిమాలలోనూ ఒకే తరహా పాత్రలు చేస్తుందనే విమర్శలు రావడంతో ఆమెను వారి వారి సినిమాలలో పెట్టుకోలేదు కొంతమంది సినిమా నిర్మాతలు. ఫైనల్ గా శ్రీ లీల ఇప్పుడు పెద్దగా సినిమాలను చేయడం లేదని చెప్పాలి. అప్పట్లో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తే ఆమె చేతిలో కొత్త సినిమాలు పెద్దగా ఏమి ఉండవు. అందుకే కాబోలు శ్రీ లీల ఇప్పుడు ఓ సరికొత్త ఆలోచన చేసి తన కెరియర్ను ముందుకు సాగేలా చేసుకుంటుంది.

Also Read: Ram Pothineni: తనకు కలిసిరాని పని చేస్తున్న రామ్ పోతినేని!!

తెలుగులో చాలామంది హీరోయిన్ లు ఇతర భాషలలో సినిమాలు చేయడానికి ఆశపడుతూ ఉంటారు. అయితే సక్సెస్ వచ్చాక బాలీవుడ్ వంటి పరిశ్రమలోకి వెళ్లిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలా కాకుండా కెరియర్ మధ్యలోనే బాలీవుడ్ సినిమాలు ఇప్పటిదాకా ఎవరు చేయలేదని చెప్పాలి. కానీ శ్రీ లీల ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. తాజాగా ఓ బాలీవుడ్ సినిమా కోసం ఆమె సంతకం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా శ్రీ లీల తెలుగులో సినిమా అవకాశాల కోసం మరింతగా ప్రయత్నించడం పక్కన పెట్టి పొరుగు భాషలో నటించడం ఆమె అభిమానులను ఎంతో నిరాశ పరుస్తుంది. కొత్త హీరోయిన్లు వచ్చి ఆమె అవకాశాలను ఎగవేసుకు పోతుంటే ఆమె ఆ మాత్రం ఇక్కడ ఉండకుండా వెళ్లిపోవడం కరెక్ట్ కాదని వారు చెబుతున్నారు. ఇంకొక వైపు తమిళంలో కన్నడంలో సినిమాలు చేస్తూ తెలుగులో కూడా ఆఫర్ల కోసం ప్రయత్నించాలని చెబుతున్నారు. మరి శ్రీ లీల బాలీవుడ్లో సక్సెస్ అయ్యి మళ్ళీ తెలుగులోకి పూజా హెగ్డే లాగా రీ ఎంట్రీ ఇస్తుందా అనేది చూడాలి.