Sukumar movie with vijay deverakonda

Sukumar: టాలీవుడ్ స్పెషల్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయాలనీ ఏ హీరో కి ఉండదు చెప్పండి.ఆల్రెడీ సినిమా చేసిన హీరో లు సైతం మళ్ళీ సినిమా చేయడానికి తహతహలాడుతుంటారు. ఆ విధంగా రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంభందించి ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సుకుమార్ సినిమా ను రామ్ చరణ్ చేసే విధంగా కనిపించడం లేదు. ఎందుకంటే రామ్ చరణ్ ఇప్పుడు ఇతర సినిమాలు మొదలుపెట్టాడు.

Sukumar movie with vijay deverakonda

శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ చేంజర్’ సినిమా ను ఈ ఏడాది విడుదల చేయబోతున్న రామ్ చరణ్ ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తయ్యే సరికి ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉండడంతో సుకుమార్ అంత వరకు వేచి చూస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతం పుష్ప 2 సినిమా ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. డిసెంబర్ లో మొదటి వారం లోనే ఈ సినిమా విడుదల కాబోతుంది.

Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడి.. మరీ ఇంత ఫాస్టా గురూ!!

ఈ నేపథ్యంలో సుకుమార్ 2025 మొత్తం ఖాలిగా ఉంటాడా అనేది చూడాలి. సుకుమార్ సినిమా సినిమా కు ఎక్కవు గ్యాప్ తీసుకోడు. దానికి తోడు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత చరణ్ సుకుమార్ తో కాకుండా వేరే పెద్ద దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి సుకుమార్ గతంలో ఒప్పుకున్న సినిమా చేస్తున్నాడా అనేది చూడాలి. విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయడానికి సుకుమార్ ఒప్పుకున్న విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మధ్య లో సినిమా ఆగిపోయిందని అన్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆ సినిమా పట్టాలెక్కడం ఖాయం అని చెప్పాలి. ఇంకోవైపు విజయ్ దేవరకొండ మూడు సినిమాలతో బిజీ గా ఉన్నాడు.