Talk on raviteja romance in movies

Raviteja: రవితేజ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా పైనే అందరి చూపు ఉంది. ఆయన గత చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోవడంతో ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాలని మాస్ రాజా అభిమానులు భావిస్తున్నారు. బాలీవుడ్ లో తెరకెక్కిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రీమేక్ సినిమాలను హ్యాండిల్ చేయడంలో దిట్ట ఆయన హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్టార్ హీరోల ఇమేజ్కు తగ్గట్లు కమర్షియల్ మసాలాలు జోడించి సినిమాలు చేసే మాస్ దర్శకుడుగా పేరు సంపాదించుకున్నాడు.

Talk on raviteja romance in movies

పవన్ కళ్యాణ్ ను ‘గబ్బర్ సింగ్’ గా చూపించి భారీ స్థాయిలో క్రేజ్ తెచ్చుకొని ఆ తరువాత ఓ తమిళ సినిమాను ‘గద్దల కొండ గణేష్’ గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఈ సినిమా యొక్క ప్రమోషన్ మెటీరియల్ చూస్తే హరీష్ శంకర్ చాలానే మార్పులు చేసినట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్లో రైడ్ సినిమా సీరియస్ డ్రామా గా ఉంటుంది. కనీ ‘మిస్టర్ బచ్చన్’ ఎంతో ఫన్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఏదేమైనా ఈ సినిమాలో ఇంకో చెప్పుకోదగ్గ అంశం రొమాన్స్ రవితేజ ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ భాగ్యశ్రీ తో కలిసి రొమాన్స్ బాగానే చేశాడని చెప్పాలి.

Also Read: Pushpa 2: బాలీవుడ్ లో పుష్ప 2 కి క్రేజ్ తగ్గిపోయిందా!!

50 ఏళ్ల వయసులో కూడా రవితేజ ఈ స్థాయిలో రొమాన్స్ చేస్తూ ఉండటం యువ హీరోలకు అసూయ పుట్టించేది అని చెప్పాలి. ఈ సినిమాలో మాత్రమే కాదు రవితేజ తన సినిమా లలో హీరోయిన్లతో చేసే రొమాన్స్ శ్రుతి మించే విధంగా ఉండడం ఫ్యామిలీ ఆడియన్స్ కు పెద్దగా నచ్చడం లేదట. త మొదటి సినిమా నుంచి కుటుంబ కథ సినిమాలను చేస్తూ ఆ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ ఈ విధమైన విమర్శలు ఎదుర్కోవడం దేనికి దారితీస్తుందో మరి.