Vijay deverakonda movie vd12 on march 28

VD12: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం యొక్క విడుదల తేదీని నేడు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ మధ్యే శ్రీలంక షెడ్యూల్ పూర్తి చేసుకుని దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 28వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా యొక్క విడుదల పట్ల అందరిలో ఎంతో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈరోజు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడం అభిమానులను ఎంతగానో సంతోష పెట్టింది.

Vijay deverakonda movie vd12 on march 28

ఆ విధంగా యాక్షన్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మంచి సక్సెస్ సాధించి చాలా రోజులే అయిపోయిన నేపథ్యంలో విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించగా ఇప్పుడు రాబోయే ఈ సినిమా పై విజయ్ అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారని చెప్పాలి. ఆయన గత సినిమా ఫ్యామిలీ స్టార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

Also Read: Mister Bachchan: రీమేక్ లా అనిపించే మిస్టర్ బచ్చన్.. అది హరీష్ శంకర్ అంటే!!

అయితే చిత్ర బృందం ఈ సినిమా యొక్క విడుదల తేదీని మార్చిలో నిర్ణయించడం టాలీవుడ్ లో పలు రకాల చర్చలకు దారితీస్తుంది అని చెప్పాలి. ఈ ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారేమోనని మొదట అనుకున్నారు కానీ పలు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ లో ప్రభాస్ లాంటి హీరో సినిమా ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని 10 రోజుల ముందుగా విడుదల చేయడం నిజంగా సాహసం అనే చెప్పాలి.

అంతేకాదు ఇతర పెద్ద సినిమాలు కూడా మార్చి 28 తేదీని టార్గెట్ చేయడంతో ముందుగా తమ సినిమాను అనౌన్స్ చేయాలని చెప్పి చిత్ర బృందం ఈ విధంగా ప్రకటన చేసింది మరి ఈ తేదీని ఉపయోగించుకోవాలని మరి సినిమా బృందమైన ఆలోచిస్తుందేమో చూడాలి. అనిరుద్ సంగీతాన్ని సమకూరుస్తున్న సినిమా టైటిల్ ని కూడా ఆగస్టులోనే రివిల్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.