Harish Rao: హైదరాబాద్ నీ అయ్య జాగిరి కాదు అంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై విరుచుకుపడ్డారు ట్రబుల్ షూటర్ హరీష్ రావు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పది సంవత్సరాలలో.. తనకు గులాబీ పార్టీ అసెంబ్లీలో మాట్లాడేందుకు మైకు ఇవ్వలేదని చురకలనిపించారు దానం నాగేందర్. Harish Rao

Harish Rao Fires On Danam Nagender

అయితే దానం నాగేందర్ కు మైకు ఇవ్వడం పై గులాబీ పార్టీ నేతలు చాలా సీరియస్ అయ్యారు. దానికి కౌంటర్ గా దానం నాగేందర్ రెచ్చిపోయి మాట్లాడారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాదులో తిరగనియ్యమని.. నీ అమ్మ అంటూ నోటికి వచ్చిన బూతులు మాట్లాడారు దానం నాగేందర్. ఇక దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ గా నిలవడం జరిగింది. Harish Rao

Also Read: Jagan: వైసీపీ ఎంపీలకు 70 కోట్ల ఆఫర్… షాక్ లో జగన్?

అయితే దీనిపై.. మాజీ మంత్రి హరీష్ రావు ట్రబుల్ షూటర్ రెచ్చిపోయి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ ని అయ్య జాగిరి కాదు అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు రోడ్లమీద తిరిగే పరిస్థితి లేదని.. అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టిన వెధవ అంటూ హరీష్ రావు మండిపడ్డారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం హాట్ టాపిక్ అయింది. Harish Rao