It was a bitter experience for Bhumika

Bhumika: సింహాద్రి, మిస్సమ్మ, ఖుషి,ఒక్కడు వంటి సినిమాలతో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మారిన భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. భూమిక నటించిన మూడు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ అవ్వడంతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మగా భూమికకు పేరు వచ్చింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ కి ఒక చేదు అనుభవం ఎదురైందట.

It was a bitter experience for Bhumika

ఓ సినిమా షూటింగ్ సమయంలో అది తీసేస్తేనే సినిమా షూటింగ్ లేదంటే లేదు అంటూ సినిమాటోగ్రాఫర్ బెదిరించారట. మరి ఆయన ఎవరు.. భూమికను ఎందుకు బెదిరించారు అనేది ఇప్పుడు చూద్దాం. భూమిక ఖుషి సినిమా షూటింగ్ సమయంలో పాల్గొన్న సమయంలో ఆ మూవీ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ భూమిక మేకప్ తీసేస్తేనే సినిమా షూట్ చేస్తానని బెట్టు చేశారట.(Bhumika)

Also Read: Lavanya: లావణ్య కడుపులో తంతూ శేఖర్ భాషా దాడి.. అక్కడ చేతులు వేసి..?

అయితే ఈ సినిమా సమయంలో భూమిక అసలు మేకప్ కూడా ఎక్కువ వేసుకోలేదట. ఏదో రెండు మూడు సందర్భాలలో అలా కొద్దిగా వేసుకుందట. కానీ ఓసారి పవన్ కళ్యాణ్, భూమిక ఇద్దరూ ఆరిపోయే దీపాన్ని చేతులతో అడ్డుకునే సీన్ షూట్ చేస్తున్న సమయంలో లైట్ గా మేకప్ వేసుకున్న భూమిక ను సినిమాటోగ్రాఫర్ పిలిచి మరీ నువ్వు ఆ మేకప్ తీసేయకపోతే సినిమా షూట్ చేయను అంటూ గట్టిగా చెప్పారట.

It was a bitter experience for Bhumika

దాంతో చేసేదేమీ లేక భూమిక తన మొహం మీద వేసుకున్న మేకప్ ని తీసేసి వచ్చి షూటింగ్లో పాల్గొంద. అయితే ఈ విషయం గురించి భూమిక ఓ ఇంటర్వ్యూలో శ్రీరామ్ గారు ఆరోజు అలా అనడంతో నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ తర్వాత ఆయన మూడ్ బాలేదు కావచ్చు అందుకే నాతో అలా ప్రవర్తించారు అని మేకప్ తీసేసాను అంటూ భూమిక చెప్పుకొచ్చింది.(Bhumika)