Miss Blockbuster movie in Balakrishna Bhumika combination

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోయిన్ భూమిక చావ్లా కాంబినేషన్లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని బాలకృష్ణ ఎందుకు మిస్ చేసుకున్నారు. అసలు ఆ సినిమాలో బాలకృష్ణ నటించకపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. బాలకృష్ణ భూమిక కాంబినేషన్లో రూలర్ మూవీ వచ్చింది. కానీ వీరి కాంబినేషన్లో మరో బ్లాక్ బస్టర్ మూవీ కూడా రావాల్సిందట.

Miss Blockbuster movie in Balakrishna Bhumika combination

గతంలో విజయేంద్ర ప్రసాద్ వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తీయడం కోసం కథ కూడా ప్రిపేర్ చేశారట. కానీ చివరికి కథ పూర్తిగా ఉన్న బాలకృష్ణ నేను చేసే సినిమాలు లాగే ఈ స్టోరీ ఉంది. అలాగే ఇప్పటికే ఎన్నో యాక్షన్ సినిమాల్లో నటించాను.ఇది కూడా అలాంటి సినిమానే కాబట్టి కాస్త కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా.. అందుకే ఈ సినిమాలో నేను చేయను అని బాలకృష్ణ రిజెక్ట్ చేశారట. (Balakrishna)

Also Read: Bollywood: ఆ హీరో పెళ్ళైన 2 నెలలకే వేరే హీరోయిన్ రొమా**.. భార్యకి తెలిసి..?

ఇక ఆ సినిమా ఏదో కాదు సింహాద్రి.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాలో మొదట హీరో ఛాన్స్ బాలకృష్ణనే వరించిందట. కానీ ఈ సినిమా ఇప్పటివరకు నేను తీసిన యాక్షన్ సినిమాల్లాగే ఉన్నాయి ప్రస్తుతం నేను వేరే జానర్ లో సినిమా తీయాలి అనుకుంటున్నాను అని బాలకృష్ణ రిజెక్ట్ చేశారట.దాంతో బాలకృష్ణ నో చెప్పడంతో ఆయన అన్న కొడుకు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి ఈ కథ చేరింది.

Miss Blockbuster movie in Balakrishna Bhumika combination

అలా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్,అంకిత, భూమికలు హీరో హీరోయిన్స్ గా చేశారు. ఇక సింహాద్రి సినిమా వచ్చి ఇన్ని ఏళ్లయినా కూడా ఇప్పటికీ ఈ సినిమాని ఎంతోమంది ఇష్టంగా చూస్తారు. అలా మొదట సింహాద్రి మూవీ బాలకృష్ణ భూమిక కాంబినేషన్లో వచ్చేదట. కానీ బాలకృష్ణ రిజెక్ట్ చేయడం కారణంగా అది కాస్త ఎన్టీఆర్ భూమిక కాంబినేషన్లో వచ్చింది.(Balakrishna)