Ashika Ranganath heroine tamil offers

Ashika Ranganath: తెలుగులో ‘నా సామి రంగ’ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఆశిక రంగనాథ్. తన అందాలతో, హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఇక్కడ మంచి హీరోయిన్ గా ఎదుగుతుందని ప్రతి ఒక్కరు కూడా భావించారు. అయితే ఆ సినిమా వచ్చి ఎనిమిది నెలలు దాటుతున్న కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే తెలుగులో కాకుండా ఆమెకు తమిళంలో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి. అక్కడివారికి ఆమెలో ఏం నచ్చిందో తెలియదు కానీ ఆశికా రంగనాథ్ కు వరుస సినిమా అవకాశాలు అక్కడ వస్తున్నాయి.

Ashika Ranganath heroine tamil offers

కార్తి నటించిన ‘సర్దార్’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ సినిమా యొక్క సీక్వెల్ లో ఈమె హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు కావడంతో ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇది మాత్రమే కాకుండా సిద్ధార్థ హీరోగా నటిస్తున్న ‘మిస్ యూ’ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదల కాగా అందులో ఆమె లుక్స్ కు యూత్ ఫిదా అవుతుంది.

Also Read: Balakrishna: హనుమాన్ డైరెక్టర్ పై బాలయ్య వత్తిడి.. ఆ సినిమా ఆపేయాలంటూ!!

ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా ‘గత వైభవ’ అనే సినిమాలో ఆమె నటించబోతుంది. ఆ విధంగా వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్న ఈమెకు తెలుగు సినిమా పరిశ్రమ అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదో తెలియదు కానీ అక్కడ మాత్రం తాను బిజీగా ఉంటుంది. ఇక తెలుగులో ఆమె చేస్తున్న ఏకైక సినిమా ‘విశ్వంభర’ ఇందులో ఆమె ఏ పాత్రలో చేస్తుందో తెలియదు కానీ ఈ చిత్రం ఆమె కెరియర్ కు బాగానే హెల్ప్ అవుతుంది అని చెప్పాలి. సోషియో ఫాంటసీ సినిమాగా ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక తెలుగులో అంతకుముందు ‘అమిగోస్’ అనే చిత్రంలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.