Balakrishna movie with hanuman director

Balakrishna: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా, హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా మోక్షజ్ఞ ఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా వార్తలు వినిపించగా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూడ సాగారు. ఆ విధంగా ఇప్పుడు ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్ పట్ల క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Balakrishna movie with hanuman director

నందమూరి బాలకృష్ణ సినిమా పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన ఓ గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చాలామంది ప్రముఖులు ఈ ఫంక్షన్ కు రాబోతుండగా తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇక్కడ చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ డెబ్యు ప్రాజెక్టును గ్రాండ్ గా ప్రారంభించి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read: Nani: దసరా పేరు చెప్పుకుని.. ఇంకెన్నేళ్లు లాగుతావు నాని!!

అయితే ఈ సినిమా ను పట్టాలెక్కించడానికి బాలకృష్ణ శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది. ‘హనుమాన్’ సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ ఆ చిత్రం తర్వాత హనుమాన్ 2 చేయవలసి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఇది ముందుకు వెళ్లకపోవడంతో మోక్షజ్ఞ సినిమా చేయాలని బాలకృష్ణ పట్టుబట్టాడట. ఇంత పెద్ద హీరో అడగడంతో చేసేదేం లేక ఈ సినిమానే ముందు చేయాలని ప్రశాంత వర్మ భావిస్తున్నాడట. మరి వెరైటీ చిత్రాల దర్శకుడిగా భారీ సినిమాలు చేసే దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ చేయబోతున్న ఈ ఫాంటసీ మైథాలజికల్ సినిమా ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.