Chiyaan Vikram About Tangalaan Telugu movie

Chiyaan Vikram: తమిళ హీరో విక్రమ్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఆ విధంగా ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ ‘తంగలాన్’ అనే సినిమాలో నటించగా ఈ చిత్రం ఈనెల 15వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతూ ఉండడం విశేషం. కోలార్ గోల్డ్ ఫీల్స్ద్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతూ ఉండగా విక్రమ్ ఇప్పటిదాకా ఆయన చేసిన పాత్రలో మంచి పాత్ర ఈ సినిమాలోని పాత్ర అని చెప్పారు.

Chiyaan Vikram About Tangalaan Telugu movie

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి విక్రమ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగువారు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే చాలా బాగుంది అని ఆయన చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ తనకు ప్రత్యేక అన్నారు.. తన మొదటి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు అందించిన సపోర్ట్, ఎంకరేజ్మెంట్ బాగుంటుంది అని చెప్పారు. వందేళ్ళ క్రితం జరిగిన ఓ కథతో ఒక మంచి సినిమాను నా డ్రీమ్ డైరెక్టర్ రంజిత్ తో చేశాను.. ఇది చాలా బాగుంటుంది అన్నారు.

Also Read: VD12: విజయ్ దేవరకొండ లైనప్ మాములుగా లేదు గురూ!!

ఈ చిత్రం గురించి చెప్పినప్పుడు మొదట చాలా ఎక్సైట్ అయ్యాను అని ఆయన అన్నారు. సినిమా గురించి ఏది లీక్ చేయబోనని తప్పకుండా థియేటర్లో మీరు ఒక మంచి సినిమాను చూడవచ్చు అని ఆయన చెప్పారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక విక్రమ్ గత సినిమాల విషయానికొస్తే గత కొంతకాలంగా ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ సినిమా పైన ఎన్ని ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఆయన ఏ విధంగా ప్రేక్షకులను ఈ సినిమా ద్వారా ఆకట్టుకుంటారో చూడాలి.