Janhvi Kapoor Devara’s second single

Devara: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్ లో అడుగు పెడుతూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది హీరోయిన్ జాన్వీ కపూర్. శ్రీదేవి నటవరసరాలుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి వరుస చిత్రాలను చేస్తూ అక్కడివారిని ఎంతగానో ఆకట్టుకున్న జాన్వి ఇప్పుడు తెలుగులో తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతుంది. ఆమె క్రేజ్ కు తగ్గట్లుగానే ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

Janhvi Kapoor Devara’s second single

ఆ విధంగా జాన్వీ కపూర్ అభిమానులు ఆమె టాలీవుడ్ కి రావడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా ప్రస్తుతం ఆమె ప్రేక్షకులను అలరించే విధంగా దేవర సినిమాలోని ఓ పాటలో అందాల విందును చేస్తుందన్న వార్తలు రావడం ఆమె అభిమానులను ఇంకాస్త ఉల్లాసపరుస్తుంది. ఇప్పటికే ఓ పాట విడుదలైన నేపథ్యంలో దేవర సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో రెండవ పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేసింది.

Also Read: Mohammed Shami: టీమిండియాలోకి రాకుండా షమీపై కుట్రలు ?

ఈ పాటలో జాన్వి అందాలను తనివితీరా వడ్డిస్తుంది అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి వచ్చిన పోస్టర్లు ప్రోమో లు ఆమె అందాలను చూపించి చూపించినట్లుగా వ్యవహరించడం మరింత ఆసక్తిని పెంచుతుంది. ఆమె వేసుకున్న బట్టలు ఆమె ఉబికి వచ్చిన అందాలను దాచుతున్నట్లు కాకుండా చూపించినట్లు అనిపిస్తుంది. ఆ విధంగా ఈ పాట జాన్వి అందాలకు సరిగ్గా సరిపోతుంది అని చెబుతున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక దేవ సినిమా అక్టోబర్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు.