Kushi Kapoor Heroine in telugu movies

Kushi Kapoor: సినిమా పరిశ్రమలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు పనిచేయడం కొత్త ఏమీ కాదు.. హీరోలు చాలామంది అన్నతమ్ములు నటిస్తూ ఉన్నారు. హీరోయిన్లు కూడా అక్కాచెల్లెళ్లు నటిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి నటించబోతూ ఉండటం వారి అభిమానులను ఎంతగానో ఆనంద పరుస్తుంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది జాన్వీ కపూర్. ఇప్పుడు తెలుగులో కూడా ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Kushi Kapoor Heroine in telugu movies

ఎన్టీఆర్ సరసన ‘దేవర’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఆమెకు ఎలాంటి పేరు తీసుకు వస్తుందో చూడాలి. గ్లామర్ చూపించడంలో తనకు సాటి ఎవరూ లేరు. తన అందాలతో తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. అయితే ఆమెకు ఒక చెల్లెలు కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె ఇప్పటిదాకా ఏ సినిమాలో నటించలేదు కానీ తెలుగులో ఓ చిత్రం ద్వారా సినిమాలకు పరిచయం కాబోతుంది అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Anasuya: అనసూయ అందాల నీతులు.. కొడుకుని లాగుతూ!!

శ్రీదేవి, బోనీకపూర్ జంటకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దమ్మాయి జాన్వీ కపూర్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు రెండో కూతురు ఖుషి కపూర్ కూడా సినిమాలు చేసి ఓ సెన్సేషన్ కావాలని భావిస్తుందట. అందుకే తెలుగులో మోక్షజ్ఞ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటించదానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే అంటున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత వర్మ కాగా ఫాంటసీ మైథలాజికల్ సినిమాగా ఇది రూపొందుతుంది. తొందరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. సెప్టెంబరు ఒకటవ తేదీన ఈ సినిమా యొక్క పూర్తి వివరాలు ప్రేక్షకులకు వెల్లడించనున్నారు. ఒకవేళ ఖుషి కపూర్ నటించడం అనేది నిజమే అయితే ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు టాలీవుడ్ ను ఏలడం ఖాయం అనే చెప్పాలి.