Nani hero Dasara combo repeat again

Nani: కొంతమంది హీరోలు ఒక హిట్టుతో పది సంవత్సరాలు తమ కెరియర్ను ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. ఒక హిట్టుతో వచ్చిన క్రేజ్ 10 సినిమాలకు సరిపెడుతూ వరుస చిత్రాలను చేస్తూ ఉంటారు. ఆ విధంగా నాని కెరియర్ లో విజయాల కంటే ఎక్కువగా పరాజేయాలే పలకరించాయని చెప్పాలి. మొదట్లో వరుసగా పది సినిమాలకు పైగా అపజయాలను అందుకొని ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు వరుస సినిమాలను చేస్తున్నాడు. అలా ఆ మధ్య దసరా అనే మాస్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నాని ఆ తరువాత ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించలేకపోయాడు.

Nani hero Dasara combo repeat again

అందుకే ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడు తో కలిసి మరో సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెళ్లడవుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ అనుకుంటున్నారట. అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారని చెబుతున్నారు. ఏదేమైనా నాలుగు సంవత్సరాల క్రితం హిట్టు కొట్టిన నాని ఇప్పటిదాకా సరైన సినిమాతో ప్రేక్షకులను అలరించలేకపోయాడని చెప్పాలి. ఇప్పుడు రాబోయే ఈ సినిమాకు 100 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారని చెబుతున్న నేపథ్యంలో ఇది నాని మార్కెట్ కు ఎక్కువ అవుతూ ఉండడం నిర్మాతకు ఎంతవరకు కలిసి వస్తుందనేది అసలు విషయం.

Also Read: Devara: జాన్వీ ను ఎంత వాడాలో అంత వాడుకున్నట్లుంది!!

ఫైనల్ గా దసరా సినిమాకి గాను పలు ఫిలింఫేర్ అవార్డులు రావడం ఆయన అభిమానులను ఎంతగానో ఉత్సాహపరుస్తుంది. కానీ మ్యూజిక్ విభాగంలో ఈ చిత్రానికి అవార్డు రాకపోవడం వారిని నిరుత్సాహపరిచింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమాకి గాను ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు లభించింది. దీనిపట్ల నాని అభిమానులు హడావుడి చేస్తున్న మరి కొంతమంది బేబీ సినిమాకి ఆ అవార్డు రావడం కరెక్ట్ అని వాదిస్తున్నారు. ఏదేమైనా నాని త్వరగా ఓ మంచి సినిమాతో హిట్ కొట్టాలని నాని అభిమానులు భావిస్తున్నారు.

కెరీర్లో ఇప్పటిదాకా ఎక్కువగా మాస్ సినిమాలు చేయకుండా క్లాస్ సినిమాలతో అలరిస్తూ వచ్చిన నాని ఈసారి ఎలాంటి సినిమాతో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. ఈ సినిమాతో పాటే నాని హిట్ 3 సినిమాను కూడా లైన్ లోకి పెట్టబోతున్నాడు. పలు బడ్జెట్ కారణాల వల్ల ఎన్ని రోజులు ఈ సినిమా హోల్డ్ లో ఉండగా ఇప్పుడు ఈ సినిమా యొక్క షూటింగ్ పనులు తొందరలోనే మొదలు కాబోతున్నాయి. దసరా కాంబినేషన్ మరికొన్ని రోజులు వాయిదా పడనున్నట్లు సమాచారం.