Prashanth neel hand to ntr and prabhas

Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమాలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతూ ఉండగా ఈ చిత్రం ఎన్టీఆర్ కు సూపర్ హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటు కొరటాల శివ కెరియర్ కూడా మునుపటిలా ఉండాలి అంటే తప్పకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద నెంబర్స్ కలెక్షన్స్ వసూలు చేయాలి. ఆ విధంగా సినిమా విజయం చాలామందికి ఎంతో అవసరం అనే చెప్పాలి.

Prashanth neel hand to ntr and prabhas

ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో ‘వార్ 2’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తూ ఉండగా ఇది తప్పకుండా ఆయనకు గ్లోబల్ ఇమేజ్ ను తెచ్చి పెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక సినిమా తర్వాత మరొక సినిమాను సెట్ చేసుకుంటూ ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తో కూడా ఆయన ఓ సినిమా చేయవలసి ఉంది. ఈ సినిమాను ఆయన కొన్ని రోజులు పక్కన పెడుతున్నారన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

Also Read: Balakrishna: హనుమాన్ డైరెక్టర్ పై బాలయ్య వత్తిడి.. ఆ సినిమా ఆపేయాలంటూ!!

ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా జరగడం లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. కారణాలు ఏవైనా కూడా ఆ చిత్రాన్ని పక్కనపెట్టి ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో ప్రశాంత్ బిజీగా ఉన్నారు ఇన్ని రోజులు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఇతర సినిమాల మీద కాన్సెంట్రేట్ చేయడంతో ప్రశాంత్ సినిమాను పక్కన పెట్టక తప్పడం లేదట. దాంతో ప్రశాంత్ ఇప్పుడు మరొక హీరోను వెతుక్కోవలసిన అవసరం ఏర్పడింది. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను చేయవలసి ఉన్న నేపథ్యంలో రామ్ చరణ్ కూడా ఇతర సినిమాలలో బిజీగా ఉండడంతో ప్రశాంత్ ఎవరితో సినిమా చేస్తాడో అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.