Pushpa2 movie roumers on its release

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప2’ చిత్రంకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయని ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతున్న విధానాన్ని బట్టి తెలుస్తుంది. రెండు మూడేళ్లుగా ఈ సినిమాను తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తున్న నేపథ్యంలో మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో రెండవ భాగంపై మరింత దృష్టి పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దేశంలోనే ప్రెస్టేజియస్ సినిమా అని చెప్పాలి. ప్రపంచం మొత్తం కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Pushpa2 movie roumers on its release

పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన బాక్సాఫీస్ రికార్డులు సైతం ఈ సినిమాతో బద్దలు కాగా ఈసారి పుష్ప1 రికార్డులను కూడా ఈ చిత్రం కొల్లగొడుతుందని అభిమానులు పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ను ఇచ్చారు. క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఇప్పటివరకైతే ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా కన్ఫామ్ చేశారు. కానీ వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా డిసెంబర్ వరకు కూడా పూర్తి కాదని చెబుతున్నారు.

Also Read: Chiranjeevi: చిరు కి అది మర్చిపోలేని సినిమా.. ఏకంగా టాప్ 5!!

ఇదే జరిగితే ఈ సినిమా వేసవికి వస్తుంది. మరి ఆ సమయంలో ఇతర పెద్ద సినిమాలు ఉండడంతో ఈ చిత్రం అన్ని పెద్ద సినిమాల మధ్య విడుదల అవుతుందా అనేది చూడాలి. రష్మిక హీరోయిన్ గా నటిస్తూ ఉండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కాబోతుంది. సుకుమార్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఆగస్టులోనే విడుదల అవ్వాల్సి ఉండగా పలు కారణాల వల్ల దీనికి డిసెంబర్లో విడుదల చేయబోతున్నారు. ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ చేయడం ఏంటి అని కొంతమంది అభిమానులు వాపోతున్నారు. ఇదంతా ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి, ఎప్పుడు సినిమా విడుదల కావాలి అని చెబుతున్నారు. దీన్నిబట్టి తప్పకుండా ఈ సినిమా డిసెంబర్ కు రాదని చెప్పవచ్చు.