Ravi Teja association with that actor

Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ట్యాగ్ అనేది ఉంటుంది. అలా టాలీవుడ్ లో ఉన్న రవితేజ కి మాస్ మహారాజా అనే ట్యాగ్ ఉంది. ఈయన అటు క్లాస్ ఇటు మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇలా ప్రతి ఒక్కరిని తన సినిమాలతో అట్రాక్ట్ చేశారు. అయితే అలాంటి రవితేజ కి ఒక కొడుకు ఒక కూతురు అనే సంగతి మనకు తెలిసిందే. ఇక రవితేజ భార్య కళ్యాణి.. అయితే రవితేజ తన ఫ్యామిలీని సోషల్ మీడియాకి,ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంచుతారు..

Ravi Teja association with that actor

తన సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్లో కూడా పిల్లల్ని, భార్యను తీసుకురారు. అయితే రవితేజ కి పెళ్లయిన సమయంలో అత్త మామ ఉన్నా కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ నటుడు ఆయన కాళ్లు కడిగి కన్యాదానం చేశారట. మరి ఆయన ఎవరు.. అత్తమామ ఉండగా ఆయన ఎందుకు కాళ్లు కడిగారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు, హీరోయిన్లకు సన్నిహితులు అనే వాళ్ళు ఉంటారు.అలా మాస్ మహారాజా రవితేజ కి కూడా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులతో సాన్నిహిత్యం ఉంది. (Ravi Teja)

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ డ్రీమ్ రోల్ అదేనా..?

అలాగే నటుడు రాజా రవీంద్రాతో కూడా రవితేజకు మంచి సాన్నిహిత్యం ఉందట.వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు.అలా వీరి మధ్య ఉన్న మంచి అనుబంధం కారణంగా రవితేజ కష్టసుఖాల్లో ఈయన ఉన్నారు. అయితే రవితేజ కళ్యాణిని పెళ్లి చేసుకున్న సమయంలో కూడా కళ్యాణి తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగా లేకపోతే పెళ్లి వ్యవహారం మొత్తం తన భుజానే వేసుకున్నారట.

Ravi Teja association with that actor

అంతేకాదు పెళ్లి సమయంలో కళ్యాణి తల్లిదండ్రులు రవితేజ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కూతుర్ని అల్లుడి చేతిలో పెడతారు. కానీ వారికి అనారోగ్యం పాలవ్వడంతో ఆ బాధ్యత మొత్తం నటుడు రాజా రవీంద్రనే తీసుకున్నారట. పెళ్లిలో రవితేజ కాళ్లు కడిగి కన్యాదానం చేశారట. అలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందట.ఇక ఈ కారణం తోనే రాజా రవీంద్రని రవితేజ మామ అని ప్రేమగా పిలుస్తారట.(Ravi Teja)