The actor who kissed Anchor Suma in live

Anchor Suma: యాంకర్ సుమ తనదైన మాటలతో ఎంతోమందిని అట్రాక్ట్ చేస్తూ స్టేజ్ మీదకి వస్తే చాలు ఎవరినైనా తన మాటలతో దడ దడలాడించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస షోలు చేస్తూ స్టార్ హీరోలకు సంబంధించి సినిమా ఈవెంట్లు చేస్తూ బిజీబిజీగా గడుపుతుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఎంత పద్ధతిగా సాంప్రదాయంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. చాలామంది యాంకర్లు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటే సుమ మాత్రం సాంప్రదాయమైన చీరకట్టుతో అందరిని ఆకర్షిస్తుంది.

The actor who kissed Anchor Suma in live

ఇక ఈమె ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకున్నా కూడా ఈమె దగ్గరికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి సుమ కి తాజాగా ఒక ఆసక్తికరమైన సంఘటన ఎదురైంది.అదేంటంటే ఓ నటుడు లైవ్ లోనే సుమని ముద్దు పెట్టుకున్నాడు. మరి దీనికి రాజీవ్ కనకాలకి సుమ ఏ విధంగా సంజాయిషి ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. యాంకర్ సుమ తాజాగా చియాన్ విక్రమ్ హీరోగా చేసిన తంగలాన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హోస్ట్ గా చేసింది. (Anchor Suma)

Also Read: Nagarjuna: నాగార్జునకి ముంబై హీరోయిన్స్ అంటేనే ఇష్టమా.. తెలుగు హీరోయిన్స్ అంటే చిన్న చూపా.?

అయితే ఈ ఈవెంట్లో సినిమాలో నటించిన వాళ్లందరూ ఒక్కొక్కరు స్టేజి మీదకి వచ్చి వారికి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు.ఇందులో భాగంగా ఇంగ్లీష్ నటుడు అయినటువంటి డేనియల్ స్టేజ్ మీదకి ఎక్కి కాసేపు మాట్లాడాడు.అయితే ఆయనకు తెలుగు రాకపోవడంతో సుమ తెలుగులో మాట్లాడించి నవ్వులు పూయించింది. ఆ తర్వాత డేనియల్ స్టేజ్ దిగి కిందకి వెళ్ళబోతుండగా సుమకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు.

The actor who kissed Anchor Suma in live

దాంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్. అంతేకాదు సుమ కూడా వన్ సెకన్ షాక్ లో ముగిపోయింది.ఇక తర్వాత వామ్మో ఈ రోజు నేను ఇంటికి వెళ్ళగలనా..రాజా ఈయన మా అన్నయ్య..త్వరలోనే రాఖి వస్తుంది.అన్నయ్య సన్నిధి అంటూ వచ్చే పాట పాడింది.దీంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం సుమ చేతిని డేనియల్ ముద్దు పెట్టుకున్న ఫోటో, వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.(Anchor Suma)