Allu Arjun’s Pushpa 2 Faces Another Setback

Pushpa 2: పుష్ప 2 సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఓవైపు సినిమా బృందం ఈ చిత్రాన్ని డిసెంబర్లోనే విడుదల చేయడానికి గట్టిగా సన్నహాలు చేస్తుంటే ఇంకొక వైపు ఈ సినిమా విడుదల మరొకసారి వాయిదా పడడం ఖాయమనే టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క మొదటి భాగం భారీ సక్సెస్ అవడంతో రెండవ భాగంపై మరింత సమయాన్ని తీసుకొని తెరకెక్కిస్తున్నారు. చాలా రోజులు ఫ్రీ ప్రొడక్షన్ పనులు చేసిన తరువాత ఇప్పుడు ఈ సినిమా యొక్క షూటింగ్ వేగంగా జరుగుతుంది.

Allu Arjun’s Pushpa 2 Faces Another Setback

వాస్తవానికి ఆగస్టు నెలలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. ఫైనల్గా డిసెంబర్ కు ఈ చిత్రం వాయిదా పడింది. అయితే కొంతమంది ఈ సినిమా డిసెంబర్ లో కూడా విడుదల అయ్యేది లేదని చెబుతున్నారు. దానికి కారణం ఈ సినిమా యొక్క పనులు పూర్తి కాకపోవడమేనట. దీనిని చిత్ర బృందం ఎక్కడ ధృవీకరించలేదు కానీ ఇది సినిమా యొక్క క్రేజ్ ను మరింతగా తగ్గిస్తుందని చెప్పాలి.

Also Read: SSMB 29: మహేష్..విక్రమ్.. రాజమౌళి.. ఊహ ఎంత బాగుందో!!

అల్లు అర్జున్ ఎన్నడూ లేనంతగా రెండు మూడు సంవత్సరాలు ఈ సినిమా పైనే ఉన్నాడు. అంతేకాదు ఈ చిత్రం యొక్క ఔట్ పుట్ కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా మరొకసారి వాయిదా పడొద్దని కోరుకుంటున్నారు అల్లు అభిమానులు. ఇంకొక వార్త ఏమిటంటే పుష్ప మొదటి భాగం విజయాన్ని అందుకున్న తరువాత నేషనల్ అవార్డును కూడా అందుకున్న తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఈగో పెరిగిపోయిందని, షూటింగ్లకు సరిగా రాకపోవడం వల్ల షూటింగ్ డిస్టర్బ్ కావడం వల్లనే ఈ సినిమాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.