Balakrishna Next Big Venture 'avesham' remake

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ మాస్ మసాలా సినిమా చేస్తున్నాడు. ఆయన కెరియర్లో 109వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ద్వారా మరో విజయాన్ని అందుకోవడానికి బాలకృష్ణ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరొకసారి బాలయ్యను మాస్ అవతారంలో చూడడం ఖాయమని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణతో సినిమాలు చేయడానికి ఇప్పుడు చాలామంది దర్శకులు క్యూలైన్లో ఉన్నారు.

Balakrishna Next Big Venture ‘avesham’ remake

అయితే ఆయన అన్ని సినిమాలను కాకుండా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతూ బాలకృష్ణ రోజురోజుకూ తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు వరుస ప్లాపులతో సతమతమవుతున్న బాలకృష్ణ ఇప్పుడు హిట్ ట్రాక్ ఎక్కి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆనందింపచేస్తున్నాడు. రాజకీయ రంగంలో కూడా బాలకృష్ణ ప్రజాప్రతినిధిగా ఉంటూ రెండు పనులను చేసుకుంటున్నాడు. కాగా ఇటీవల ఆయన ఓ తాజాగా ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు అన్న విషయం బయటకు వచ్చింది.

Also Read: Prabhas: ప్రభాస్ ఆ సినిమా కోసం తప్పు చేస్తున్నాడా?

అది కూడా ఓ రీమేక్ సినిమా అని తెలుస్తుంది. మలయాళం లో ఫాజిల్ ఫాహాద్ హీరోగా నటించిన ‘ఆవేశం’ సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులోని ఓ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ చిత్రాన్ని బాలకృష్ణ చేస్తే ఎలా ఉంటుందో అని ఓ ప్రొడక్షన్ సంస్థ ఆయనను సంప్రదించిందట. ఈ సినిమా బాలకృష్ణ చేయాలా వద్దా అన్న ఆలోచనలో ప్రస్తుతం ఉన్నారట. అయితే ఇప్పటిదాకా రీమేక్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఇష్టపడిన బాలకృష్ణ ఇప్పుడు అలాంటి సినిమాలు చేయనవసరం లేదని సలహాలు ఇస్తున్నారట ఫ్యాన్స్. దీన్నిబట్టి బాలకృష్ణ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో చూడాలి.