Because of that heroine the quarrels between Raviteja Puri jagannadh

Raviteja: రవితేజ పూరి జగన్నాథ్ మధ్య ఎంత మంచి అనుబంధం ఉంటుందో చెప్పనక్కర్లేదు.. వీరిద్దరి కాంబినేషన్లో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, నేనింతే, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలు వచ్చాయి. ఇక రవితేజకు ఇండస్ట్రీలో స్టార్డం వచ్చింది అంటే అది పూరి దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమాతో మాత్రమే.ఈ సినిమా వల్లే రవితేజకు మాస్ మహారాజా ఇమేజ్ వచ్చింది.

Because of that heroine the quarrels between Raviteja Puri jagannadh

అయితే అలాంటి ఈ ఇద్దరి మధ్య నిజంగానే ఆ హీరోయిన్ కారణంగా గొడవలు తలెత్తాయా..అసలు ఎందుకు ఆమె గొడవ పెట్టించింది అనేది ఇప్పుడు చూద్దాం. రవితేజకు పూరి జగన్నాథ్ అంటే ఎనలేని అభిమానం. ఓ ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు అనగా అందులో పూరి జగన్నాథ్ పేరు కూడా చెప్పారు. అయితే అలాంటి రవితేజ పూరి జగన్నాధ్ మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.అయితే వీరిద్దరికి మధ్య గొడవ జరగడానికి కారణం హీరోయిన్ ఛార్మి అని తెలుస్తోంది.(Raviteja)

Also Read: Shine Tom: ఆ హీరోయిన్ తో ఎఫై** వల్లే దసరా విలన్ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడా.?

ఆగస్టు 15న పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించి ఎన్నో వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడంతో ఒకరిపై మరొకరు కాస్త గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

Because of that heroine the quarrels between Raviteja Puri jagannadh

అంతేకాకుండా రీసెంట్ గా చార్మి హరీష్ శంకర్ అలాగే రవితేజ కి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో చేయడంతో ఈ వార్తలు మరింత ఉపందుకున్నాయి. ఇక చార్మి రవితేజ, హరీష్ శంకర్ లను దూరం పెట్టడంతో పూరి జగన్నాథ్ కూడా వారిద్దరికీ దూరం అయ్యారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఎంతో స్నేహంగా ఉండే రవితేజ పూరి జగన్నాధ్ ల మధ్య ప్రస్తుతం మాటల్లేవు అని తెలుస్తుంది.(Raviteja)