Differences between raviteja and puri jagannadh

Raviteja: దర్శకుడు పూరి జగన్నా థ్ కెరియర్ ఇంతటి స్థాయిలో ఉండడానికి హీరో రవితేజ ప్రముఖ కారణమని చెప్పాలి. ఇటు రవితేజ ఇంతటి స్థాయి స్టార్ హీరో కావడానికి కారణం కూడా దర్శకుడు పూరి జగన్నాథ్ అని చెప్పాలి. గతంలో వీరిద్దరి కలయికలో ఐదు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. మొదటి సినిమా ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’. ఇది ఇద్దరికీ మంచి పేరును తీసుకురాగా ఆ తర్వాత వీరు కలిసి చేసిన ‘ఇడియట్’ చిత్రం సూపర్ హిట్ అయ్యి ఇద్దరికీ స్టార్ స్టేటస్ ను తీసుకువచ్చింది. అప్పటికే పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో ‘బద్రి’ సినిమా చేసి ఉండడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Differences between raviteja and puri jagannadh

ఆ విధంగా ఇడియట్ చిత్రంతో ఈ ఇద్దరు కూడా తమ కెరియర్ లో స్టార్ లుగా నిలబడగా ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా అది మంచి విజయాన్ని సాధించింది. ఆ విధంగా వీరిద్దరూ కెరియర్లో ఇతరులతో సినిమాలు చేస్తూ రాగా ‘నేనింతే’ అనే ఓ సినిమా చేసి మళ్లీ వీరి కాంబినేషన్ కి తిరుగులేదు అని చాటి చెప్పారు. ఆ చిత్రం సినీ నేపథ్యంలో రాగా అది అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా అలరించింది.

Also Read: Janhvi Kapoor: ఒక్క పాట తో పాతుకుపోయే ప్లాన్ వేసిన జాన్వీ!!

ఇక పూరీ, రవితేజ కాంబినేషన్ లో ఆ తరువాత వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా రవితేజ హీరోగా నటించిన సినిమా, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాలు రెండు కూడా ఒకే రోజున విడుదల అవుతూ ఉండడం అందరి చర్చకు దారితీస్తుంది. అయితే వీరిద్దరి మధ్య ఈ విడుదల తేదీ కారణంగా విభేదాలు ఏర్పడ్డాయని వస్తున్నా వార్తలు తాజాగా జరిగిన ఓ సంఘటన మరింత ఆద్యం పోస్తుంది.

అదేమిటంటే ఇస్మార్ట్ శంకర్ టీజర్ లాంచ్ లో ప్లే చేసిన ఏవీ లో రవితేజ ప్రస్తావన లేకుండానే పూరి జగన్నాథ్ ఏవీ నడిచింది. ఆయన సినిమాల యొక్క డైలాగ్ కానీ విజువల్స్ కానీ ఏది కూడా కనిపించలేదు. దీనిబట్టి వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చిందని దీన్ని బట్టి తెలుస్తుంది. ముందుగా ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదల తేదీని అనౌన్సు చేయగా సడెన్ గా మిస్టర్ బచ్చన్ సినిమా అదే తేదీన విడుదల కు సిద్ధమవుతుంది.